అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy ఏపీలో ‘సాక్షి’ పత్రిక ప్రధాన సంపాదకుడి ఇంటిపై పోలీసుల దౌర్జాన్యాన్ని నిరసిస్తూ కామారెడ్డి పట్టణంలో జర్నలిస్టులు గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం (kamareddy Municipal Office) సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు అదనపు కలెక్టర్ చందర్నాయక్కు (kamareddy Additional Collector Chandra Nayak) వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ.. పత్రిక ప్రధాన సంపాదకుడి ఇంటికి వెళ్లి దాడికి పాల్పడడం పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడమేనన్నారు. నిరసన కార్యక్రమంలో జర్నలిస్టులు వేణుగోపాల చారి, రజినీకాంత్, పట్నం శ్రీనివాస్, అబీద్, రాజేష్, సురేష్, రమేష్, అన్వర్, అర్షద్, వెంకన్న, కౌసర్, సంగరాజు, ప్రభు తదితరులు పాల్గొన్నారు.
Kamareddy | నల్లబ్యాడ్జీలు ధరించి జర్నలిస్టుల నిరసన
5