- Advertisement -
Homeజిల్లాలునిజామాబాద్​Journalist Vittal Vyas | జర్నలిస్ట్‌ విఠల్‌ వ్యాస్‌ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం

Journalist Vittal Vyas | జర్నలిస్ట్‌ విఠల్‌ వ్యాస్‌ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Journalist Vittal Vyas | జమాల్‌పూర్‌ విఠల్‌ వ్యాస్‌ మెమోరియల్‌ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం జర్నలిస్‌ విఠల్​ వ్యాస్‌ ఐదో వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని రెడ్‌క్రాస్‌ సొసైటీలో (Red Cross Society) రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

Journalist Vittal Vyas | సేవా కార్యక్రమాల నిర్వహణ అభినందనీయం

ప్రముఖ వైద్యులు బొద్దుల రాజేంద్రప్రసాద్ (Boddula Rajendra Prasad), ధన్‌పాల్‌ వినయ్(Dhanpal Vinay), సందీప్‌ రావ్‌ (Sandeep Rao) హాజరై మాట్లాడుతూ.. విఠల్​వ్యాస్​ వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. అ సందర్భంగా జమాల్‌పూర్‌ విఠల్‌ వ్యాస్‌ మెమోరియల్‌ సొసైటీ (Jamalpur Vittal Vyas Memorial Society) నిర్వాహకులను అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు డా జమాల్​పూర్​ రాజశేఖర్(Jamalpur Rajasekhar), ఆర్‌అండ్‌బీ రిటైర్డ్‌ ఈఈ శ్రీమన్నారాయణ, రెడ్​క్రాస్​ సొసైటీ ఛైర్మన్​ ఆంజనేయులు, మెడికల్‌ ఆఫీసర్‌ రాజేష్, జేసీఐ అలుమ్నీ(JCI Alumni) వైస్‌ ఛైర్మన్‌ విజయానంద్, నిజామాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ కార్యదర్శి శేఖర్, తదితరులున్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News