అక్షరటుడే, డిచ్పల్లి: Mittapally | గుండెపోటుతో మృతి చెందిన సీనియర్ జర్నలిస్ట్ లక్కవత్రి నారాయణ (senior journalist Lakkavatri Narayana) అంత్యక్రియలు శుక్రవారం ఆయన స్వగ్రామం మిట్టపల్లిలో ముగిశాయి.
నారాయణ మృతదేహానికి పలువురు రాజకీయ పార్టీల నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి (MLA Bhupathi Reddy), మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావు, తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ యాదగిరి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి (Dinesh Patel Kulachari), వీ6 సీఈవో అంకం రవి తదితరులు నారాయణ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అలాగే పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సామాజిక మాద్యమం ద్వారా తన సంతాపాన్ని వెలిబుచ్చారు. నారాయణను కడసారి చూసేందుకు రాజకీయ పార్టీల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పలు సంఘాల నాయకులు, జర్నలిస్టులు మిట్టపల్లికి తరలివచ్చారు.