అక్షరటుడే, ఇందూరు: Jos Alukkas | సామాజిక సేవలో జోస్ ఆలుక్కాస్ సంస్థ ముందుండడం అభినందనీయమని మోపాల్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం ప్రసాద్ పేర్కొన్నారు.
జోస్ ఆలుక్కాస్ సంస్థ తమ సీఎస్ఆర్ ఫండ్ (CSR fund) ద్వారా సుమారు రూ. 2.29 లక్షల విలువైన పాఠశాలకు టీవీ, డ్యూయల్ డెస్క్ బెంచీలు, మైక్ సెట్, ప్రింటర్, వాటర్‌ప్లాంట్ వితరణ చేశారు. ఈ సందర్భంగా ప్రైమరీ స్కూల్ హెచ్ఎం నవనీత మాట్లాడుతూ.. జోస్ ఆలుక్కాస్ (Jos Alukkas) సంస్థ స్వచ్ఛందంగా ముందుకొచ్చి పాఠశాల విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడంపై కృతజ్ఞతలు తెలియజేశారు.
బంగారు ఆభరణాల వ్యాపారంతో (gold jewellery business) పాటు సంఘసేవ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జోస్ ఆలుక్కాస్ నిజామాబాద్ బ్రాంచ్ మేనేజర్ ధవిష్, అకౌంట్స్ మేనేజర్ జితిన్, పీఆర్వో పిప్పెర నరేందర్, పాఠశాల ఉపాధ్యాయులు శ్రీదేవి, మహేందర్, రాజ్ కుమార్, నాగలక్ష్మి, సుష్మ విద్యార్థులు పాల్గొన్నారు.