అక్షరటుడే, ఇందూరు: MP Arvind | జోస్ అలుక్కాస్ (Jose Alukkas) భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind) అన్నారు.
జోస్ అలుక్కాస్ మూడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి శనివారం సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్) (Corporate Social Responsibility funds) నిధులను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. వ్యాపారస్తులు ప్రతి ఏడాది సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుండాలన్నారు. కేవలం వ్యాపారం చేయడమే కాకుండా పేద విద్యార్థులకు అండగా ఉండడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జోస్ అలుక్కాస్ మేనేజర్, పాఠశాలల సిబ్బంది పాల్గొన్నారు.
