అక్షరటుడే, ఎల్లారెడ్డి: Wrestling competitions | ఎస్జీఎఫ్ ఉమ్మడి జిల్లా రెజ్లింగ్ పోటీలు (SGF Joint District Wrestling Competitions) మంగళవారం మండలంలోని మాచాపూర్ ఉన్నత పాఠశాలలో ప్రారంభమయ్యాయి. పోటీలను ఆర్డీవో పార్థ సింహారెడ్డి (RDO Partha Singhareddy) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు గెలుపోటములు సమానంగా తీసుకోవాలని సూచించారు.
క్రీడల్లో ఉత్తమ ప్రతిభ చూపితే భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ రజిత వెంకట్ రెడ్డి, మండల విద్యాధికారి రాజులు, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి హీరా లాల్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేందర్ రెడ్డి, నర్సింలు, రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ చౌహన్, కార్యదర్శి పవన్ కుమార్, రిటైర్డ్ ఉపాధ్యాయులు ఆకుల కిష్ణయ్య, పాఠశాల ఉపాధ్యాయులు గ్రామస్థులు పాల్గొన్నారు.
