అక్షరటుడే, ఎల్లారెడ్డి: Khokho Tournament | ఉమ్మడి జిల్లా బాలబాలికల 44వ జూనియర్స్ ఖోఖో టోర్నీ (Khokho One-Day Tournament) నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్లు ఖోఖో అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ ఎండీ అతీఖుల్లా పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం వివరాలు వెల్లడించారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్లో (old Collectorate Ground) టోర్నీ ఉంటుందన్నారు. 04-01-2008 లేదా ఆ తర్వాత జన్మించిన బాలబాలికలు మాత్రమే అర్హులని ఆయన తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు తప్పనిసరిగా తమ ఒరిజినల్ ఆధార్ కార్డు, జిరాక్స్, జనన ధృవీకరణ పత్రం, బోనాఫైడ్ సర్టిఫికెట్లు తీసుకురావాలని సూచించారు.
బాలబాలికలకు సంబంధించిన ఇండెక్స్ 250 పాయింట్లను మించకూడదని ఆయన వివరించారు. 16వ తేదీ సాయంత్రం 6గంటలలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. క్రీడాకారులు ఆర్గనైజింగ్ సెక్రెటరీ నాగేశ్వరావు (8555996271), అధ్యక్షుడు జీవీ భూమారెడ్డి (7396541233), ప్రధాన కార్యదర్శి ఎండీ అతీఖుల్లా (9676269988), కోశాధికారి మధు (9494259901)లను సంప్రదించాలని సూచించారు. క్రీడాకారులకు భోజన వసతి లేదని.. ఎవరి భోజనం వారే తెచ్చుకోవాలని స్పష్టం చేశారు.
