అక్షరటుడే, హైదరాబాద్: Joint Collector posts abolished | తెలంగాణ ప్రభుత్వం Telangana government కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని జాయింట్ కలెకర్ట్ పోస్టులను రద్దు చేసింది.
ప్రస్తుతం ఆయా జిల్లాల్లో జేసీలుగా పనిచేస్తున్న అధికారులను ఎక్స్‌ఆఫిషియో ఫారెస్ట్ సెటిల్‌మెంట్ అధికారులు (ex-officio Forest Settlement Officers) గా నియమించింది.
ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ (Telangana Forest Act), 1967 (Act No.17 of 1967) ప్రకారం సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.
రెవెన్యూ (సర్వీసెస్-I) శాఖ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. జాయింట్ కలెక్టర్ల Joint Collectors పోస్టులను రద్దు చేసి, ఆ స్థానంలో అదనపు కలెక్టర్ల నియామకం చేపట్టారు.
Joint Collector posts abolished | ఆర్డీఓపై స్థాయి..
సర్కారుకు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (HoFF) పంపిన నివేదికలో.. ఫారెస్ట్ యాక్ట్ 1967 ప్రకారం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీఓ) స్థాయి కన్నా తక్కువ కాని ఆఫీసర్‌ను ఫారెస్ట్ సెటిల్‌మెంట్ అధికారిగా నియమించవచ్చని ఉంది.
ఈ క్రమంలో రాష్ట్ర సర్కారు చర్యలు చేపట్టింది. క్షుణ్ణంగా అధ్యయనం చేసి, జాయింట్ కలెక్టర్లను ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారులుగా నియమించింది.
ఫారెస్ట్ సెటిల్‌మెంట్ అధికారులకు ఆయా జిల్లాల్లో ఉన్న నోటిఫైడ్ ఫారెస్ట్ బ్లాకులపై అధికార పరిధి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఈ ఉత్తర్వులు వెలువడినప్పుడే జాయింట్ కలెక్టర్ల పోస్టుల రద్దు అమల్లోకి వచ్చినట్లుగా సర్కారు పేర్కొంది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్ ఉత్తర్వులు ఇచ్చారు.
