అక్షరటుడే, భీమ్గల్: Bheemgal | మండలంలోని బడా భీమ్గల్ గ్రామానికి (Bada Bheemgal village) చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ (Mutyala Sunil Kumar) సమక్షంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ మేరకు వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. పార్టీలో చేరిన వారిలో మోహన్, రవి, నరేష్, శ్రీను, నేల్ల శ్రీనివాస్, మల్లేష్, అనంత్, గంగాధర్ తదితరులున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బొదిరె స్వామి, కుంట రమేశ్, నాగేంద్ర, కన్నే సురేందర్, పిట్ల శ్రీనివాస్, గట్టు సతీష్, శ్రీధర్, రాగుల మోహన్ తదితరులు పాల్గొన్నారు.
