Homeజిల్లాలుకామారెడ్డిTelangana Jagruthi | కవిత సమక్షంలో జాగృతిలో చేరికలు

Telangana Jagruthi | కవిత సమక్షంలో జాగృతిలో చేరికలు

ఎమ్మెల్సీ కవిత సమక్షంలో కామారెడ్డి, ఎల్లారెడ్డి నాయకులు తెలంగాణ జాగృతిలో చేరారు. ఈ మేరకు హైదరాబాద్​లో మంగళవారం వారికి కవిత కండువాలు వేసి సంస్థలోకి ఆహ్వానించారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Telangana Jagruthi | జిల్లా నుంచి పలువురు నాయకులు ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సమక్షంలో మంగళవారం తెలంగాణ జాగృతిలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి బీఎస్పీ(BSP) తరపున ఎమ్మెల్యేగా పోటీచేసిన సురేష్ గౌడ్, ఎల్లారెడ్డి నియోజకవర్గం (Yella Reddy Constituency) నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థి తలారి బాలరాజులు కవిత సమక్షంలో జాగృతిలో చేరారు. వారికి కవిత కండువాలు కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా నాయకులు సంపత్ గౌడ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.