అక్షరటుడే, బాన్సువాడ : Birkur | బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామానికి (Byrapur village) చెందిన బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. డీసీసీబీ మాజీ ఛైర్మన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు పోచారం భాస్కర్ రెడ్డి (Pocharam Bhaskar Reddy) సమక్షంలో బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యాలయంలో ఈ చేరికలు జరిగాయి.
గ్రామానికి చెందిన జోగు నర్సింలు, పందుల సుధాకర్, గుడికొండ సాయిలు, కొండు పండరి, తుకారాం, కమ్మరి బాబు, దుర్గయ్య, హన్మాండ్లు, కొండ్ర రాములు, పోతురాజు రాజు, నిరుడి రాజు, లస్మాపురం దశరథ్ తదితరులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్లో చేరుతున్నారని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సమష్టిగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో బీర్కూర్ మండల నాయకులు పాల్గొన్నారు.