అక్షరటుడే, పెద్ద కొడప్ గల్ : Pedda Kodapgal | మండలంలోని విఠల్ వాడికి చెందిన బీజేపీ మోర్చా గ్రామ (Morcha village) అధ్యక్షుడు కొండిగిరే మారుతి కాంగ్రెస్ పార్టీలో (Congress Party) చేరారు. ఈ మేరకు మంగళవారం పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరగా కండువా కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలకు (welfare schemes) ఆకర్షితుడై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు తనవంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చిప్ప మోహన్, మల్లప్ప పటేల్, మొగలాగౌడ్, సంతోష్ దేశాయ్, బస్వరాజ్ దేశాయ్, శంకర్ పటేల్, విజయ్, రవీందర్, దిగంబర్, తదితరులు పాల్గొన్నారు.