Forest Department Jobs
Forest Department Jobs | ఇంటర్‌తో అటవీ శాఖలో కొలువులు.. మరో వారం రోజులే దరఖాస్తు గడువు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Forest Department Jobs | ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌(Notification) విడుదల చేసింది. 256 ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌, 435 అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌(Assistant Beat Officer) పోస్టులను భర్తీ చేయనుంది. ఆయా పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 5వ తేదీ వరకు గడువుంది.

భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 691.
పోస్టుల వివరాలు : 256 ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌, 435 అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు.

అర్హతలు : ఇంటర్మీడియట్‌(Intermediate) లేదా తత్సమాన విద్యార్హత కలిగినవారు అర్హులు. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. పురుష అభ్యర్థులు కనీసం 163 సెం.మీ. ఎత్తు, మహిళలు కనీసం 150 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎన్‌సీసీ(NCC) సర్టిఫికెట్‌ ఉన్న అభ్యర్థులకు బోనస్‌ మార్కులుంటాయి.
వయోపరిమితి : జూలై 1 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్యలోపు వారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్ల వరకు సడలింపు ఉంటుంది.
వేతనం : ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ పోస్టుకు రూ. 25,220 నుంచి రూ.80,910, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ పోస్టుకు రూ. 23,120 నుంచి రూ. 74,770 వేతన శ్రేణి వర్తిస్తుంది.

దరఖాస్తు గడువు : ఆగస్టు 05.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌(Online) ద్వారా దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు ఫీజు : ప్రాసెసింగ్‌ ఫీజు రూ. 250, ఎగ్జామినేషన్‌ ఫీజు రూ. 80 చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ : స్క్రీనింగ్‌ టెస్ట్‌(Screening test), మెయిన్స్‌ ఎగ్జామినేషన్‌, కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌, ఫిజికల్‌ టెస్ట్‌ల ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు.
తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
పూర్తి వివరాలకు https://psc.ap.gov.in website లో సంప్రదించాలి.