అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Indian Railway Jobs | భారతీయ రైల్వేలో (Indian Railway) ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి ఈస్టర్న్ రైల్వే (Estern Railway) శుభవార్త చెప్పింది. స్పోర్ట్స్ కోటాలో పలు పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ (Notification) విడుదలయ్యింది. పోస్టులు, అర్హతల వివరాలిలా ఉన్నాయి.
మొత్తం పోస్టులు : 50.
ఖాళీల వివరాలు..
గ్రూప్ సి(లెవల్ 4, 5) : 05 పోస్టులు
గ్రూప్ సి(లెవల్ 2, 3) : 12 పోస్టులు
గ్రూప్ డి(లెవల్ 1) : 33 పోస్టులు
వయోపరిమితి : వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి 18 నుంచి 25 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకోవాలి.
అర్హతలు : గ్రూప్ సి(లెవల్ 4, 5) : గ్రాడ్యుయేషన్(Graduation). ఒలింపిక్ గేమ్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం లేదా ప్రపంచ స్థాయి టోర్నమెంట్స్‌లో 3వ స్థానంలో నిలిచినవారికి ప్రాధాన్యత ఇస్తారు.
గ్రూప్ సి(లెవల్ 2, 3): 12వ తరగతి లేదా పదో తరగతితోపాటు ఐటీఐ(ITI) పూర్తి చేసినవారు అర్హులు. ఆసియా/కామన్‌వెల్త్ గేమ్స్‌లో పాల్గొనడం లేదా జాతీయ స్థాయిలో 1వ/3వ స్థానంలో నిలిచి ఉండాలి.
గ్రూప్ డి(లెవల్ 1) : పదో తరగతి లేదా ఐటీఐ/నాక్ కోర్స్‌లు చేసినవారు అర్హులు. రాష్ట్ర స్థాయి లేదా సీనియర్ నేషనల్ చాంపియన్‌షిప్స్‌లో కనీసం 8వ స్థానం పొందినవారు దరఖాస్తు చేసుకోవాలి.
జీతం, అలవెన్సులు :
ఏడో సీపీసీ ప్రకారం పీబీ- 1 స్కేల్ : రూ. 5,200 – రూ. 20,200తోపాటు గ్రేడ్ పే ఉంటుంది.
గ్రూప్ డి(లెవల్ 1) గ్రేడ్ పే : రూ. 1,800.
గ్రూప్ సి(లెవల్ 2, 3) గ్రేడ్ పే : రూ. 1,900/రూ.2,000.
గ్రూప్ సి(లెవల్ 4, 5) గ్రేడ్ పే : రూ. 2,400/రూ.2,800.
దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, టీఏ అదనం. పెన్షన్(ఎన్‌పీఎస్), ఉచిత రైల్ పాస్‌లు, మెడికల్ సదుపాయాలు ఉంటాయి.
ఎంపిక విధానం :
క్రీడా ట్రయల్స్ – నైపుణ్యం, ఫిట్‌నెస్ అంచనా.
అర్హతల ఆధారంగా మార్కులు ఇలా ఉంటాయి. స్పోర్ట్స్ అచీవ్‌మెంట్స్ (50), ఎడ్యుకేషన్ (10), ట్రయల్స్ (40).
డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్‌ల అనంతరం అర్హులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు గడువు తేదీ : 09 అక్టోబర్.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్ http://www.rrcer.org/ లో సంప్రదించండి.
