ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Intelligence Bureau Jobs | పదో తరగతి అర్హతతో.. ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో ఉద్యోగాలు

    Intelligence Bureau Jobs | పదో తరగతి అర్హతతో.. ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో ఉద్యోగాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Intelligence Bureau Jobs | ఇంటెలిజెన్స్‌ బ్యూరో(Intelligence Bureau)లో సెక్యూరిటీ అసిస్టెంట్‌ (మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌) పోస్టుల కోసం కేంద్ర హోం మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌(Notification) విడుదల చేసింది. దీని ద్వారా 455 పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌ వివరాలు తెలుసుకుందామా..

    భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 455. (ఇందులో తెలంగాణ(Telangana)లో 7, ఆంధ్రప్రదేశ్‌లో 9 పోస్టులున్నాయి)

    అర్హతలు..

    • పదో తరగతి(10th Class) ఉత్తీర్ణులై ఉండాలి. డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలి. మోటార్‌ మెకానిజంపై అవగాహన అవసరం.
    • చెల్లుబాటయ్యే డ్రైవింగ్‌ లైసెన్స్‌(Driving License) పొందిన తర్వాత కనీసం ఏడాది పాటు కారు నడిపిన అనుభవం ఉండాలి.
    • ఏ రాష్ట్రం నుంచి దరఖాస్తు చేసుకుంటున్నారో ఆ రాష్ట్రం యొక్క నివాస ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది.

    వయోపరిమితి : ఈనెల 28 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్యవయసువారు అర్హులు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ(OBC)లకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

    వేతనం : రూ. 21,700 నుంచి రూ. 69,100 వరకు..

    దరఖాస్తు గడువు : సెప్టెంబర్‌ 28.

    దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ ద్వారా..

    దరఖాస్తు ఫీజు : యూఆర్‌(UR), ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ పురుష అభ్యర్థులు రూ. 650, ఎస్సీ, ఎస్టీ, మహిళ, ఈఎస్‌ఎం అభ్యర్థులు రూ. 550 చొప్పున దరఖాస్తు రుసుము చెల్లించాలి.

    ఎంపిక ప్రక్రియ..

    ఎంపిక ప్రక్రియ మూడు దశలలో ఉంటుంది.
    టైర్‌-1: రాత పరీక్ష (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌). వంద మార్కులకు పరీక్ష ఉంటుంది. ఒక గంటలో పూర్తి చేయాలి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు నెగెటివ్‌ మార్కులు(Nagative marks) ఇస్తారు. రాత పరీక్ష తేదీలను ఇంకా ప్రకటించలేదు.

    టైర్‌-2: డ్రైవింగ్‌ టెస్ట్‌..

    రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ దశ ఉంటుంది. అభ్యర్థి డ్రైవింగ్‌ నైపుణ్యాలను, వాహనానికి సంబంధించిన చిన్నపాటి సమస్యలను గుర్తించడం మరియు పరిష్కరించడంపై ఉన్న జ్ఞానాన్ని పరీక్షిస్తారు. కొన్ని సందర్బాలలో ఇంటర్వ్యూ కూడా జోడిరచవచ్చు.

    టైర్‌-23 : డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ టెస్ట్‌.
    డ్రైవింగ్‌ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థుల ఒరిజినల్‌ సర్టిఫికెట్లను తనిఖీ చేస్తారు. వైద్యపరీక్షల అనంతరం అర్హులను ఎంపిక చేస్తారు.

    పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌లో https://www.mha.gov.in లో సంప్రదించగలరు.

    More like this

    AP High Court | హైకోర్ట్‌కి పవన్ కళ్యాణ్ సినిమాలు, టికెట్ల వ్య‌వ‌హారం.. సీఎం, మంత్రులు సినిమాల్లో నటించొచ్చా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : AP High Court | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలు, టికెట్...

    Deputy CM Pawan Kalyan | ఆ ఒక్క రాత్రి ఏపీ రాజ‌కీయాల‌ని మార్చేసింది.. ఆ రోజు పెను తుఫానే వ‌చ్చింది..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Deputy CM Pawan Kalyan | ప్రతి రాజకీయ నాయకుడి జీవితంలో ఒక సంఘటన...

    Big Boss 9 | తండా నుండి బిగ్ బాస్ హౌజ్‌లోకి.. ఇన్‌స్పైర్ అయిన నాగార్జున‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Big Boss 9 | బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9...