అక్షరటుడే, వెబ్‌డెస్క్ : UPSC Notification | డిగ్రీ విద్యార్హతతో డిఫెన్స్ కొలువులు సాధించడానికి అవకాశం ఉంది. దీనికి యూపీఎస్సీ మార్గం చూపిస్తోంది. త్రివిధ దళాల్లో పలు పోస్టుల భర్తీ కోసం ఏటా రెండుసార్లు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ (Combined Defence Services Exam) నిర్వహిస్తోంది. వచ్చే ఏడాదికి సంబంధించి సీడీఎస్ఈ-1 కోసం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలచేసింది. అర్హులనుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకుందామా..
పోస్టుల సంఖ్య : 451.
విభాగాలవారీగా పోస్టులు, అర్హతల వివరాలు..
ఇండియన్ మిలిటరీ అకాడమీ(డెహ్రడూన్) – 100 పోస్టులు.
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచ్‌లర్ డిగ్రీ (Bachelor Degree).
2003 జనవరి 2 నుంచి 2008 జనవరి 1 మధ్య జన్మించినవారు అర్హులు.
ఇండియన్ నావల్ అకాడమీ(ఎజిమలా) – 26 పోస్టులు.
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీటెక్, బీఈ ఉత్తీర్ణులై ఉండాలి.
2003 జనవరి 2 నుంచి 2008 జనవరి 1 మధ్య జన్మించినవారు అర్హులు.
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ(హైదరాబాద్) – 32 పోస్టులు.
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచ్‌లర్ డిగ్రీ. ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ వారై ఉండాలి.
2003 జనవరి 2 నుంచి 2007 జనవరి 1 మధ్య జన్మించినవారు అర్హులు.
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(చెన్నై.. పురుషులు) – 275 పోస్టులు.
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(చెన్నై.. మహిళలు) – 18 పోస్టులు.
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచ్‌లర్ డిగ్రీ. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
2002 జనవరి 2 నుంచి 2008 జనవరి 1 మధ్య జన్మించినవారు అర్హులు.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా..
దరఖాస్తు గడువు : డిసెంబర్ 30.
రాత పరీక్ష తేదీ : వచ్చే ఏడాది ఏప్రిల్ 12.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్ (Hyderabad), వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం.
ఎంపిక విధానం : మొదట యూపీఎస్సీ రాత పరీక్ష నిర్వహిస్తుంది. ఇండియన్ మిలిటరీ, నావల్, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ అభ్యర్థులకు 300 మార్కులకు, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ అభ్యర్థులకు 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో మెరిట్ జాబితాలో నిలిచేవారిని ఆయా సర్వీస్ సెలక్షన్ బోర్డ్(Service Selection Board)లు నిర్వహించే ఇంటర్వ్యూకు పిలుస్తారు. అనంతరం అర్హులను శిక్షణకు ఎంపిక చేస్తారు.
స్టైఫండ్ వివరాలు..
శిక్షణ కాలంలో నెలకు రూ. 56,100 స్టైఫండ్ అందిస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగం ఇస్తారు. నావీలో మాత్రం సబ్ లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగ జీవితం ప్రారంభమవుతుంది. ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లయింగ్ ఆఫీసర్‌గా విధుల్లో చేరతారు.
పూర్తి వివరాలకు www.upsc.gov.in లో సంప్రదించగలరు.