అక్షరటుడే, వెబ్‌డెస్క్: BSF Jobs | బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) ట్రేడ్స్‌మెన్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఈనెల 26 ప్రారంభమయ్యింది. నోటిఫికేషన్ వివరాలిలా ఉన్నాయి.
భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 3,588. కుక్, వాటర్ క్యారియర్, వాషర్, బార్బర్, ఇతర కానిస్టేబుల్(ట్రేడ్స్‌మన్(Tradesmen) పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. (ఇందులో పురుషులకు 3,406 పోస్టులు, మహిళలకు 182 పోస్టులు కేటాయించారు.)
విద్యార్హత : పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ(ITI) పూర్తి చేసినవారు అర్హులు.
వయో పరిమితి : 18 నుంచి 25 ఏళ్లు.
శారీరక ప్రమాణాలు : పురుషులు 165 సెంటీమీటర్ల ఎత్తు, 75 నుంచి 80 సెంటీ మీటర్ల ఛాతీ విస్తీర్ణం కలిగి ఉండాలి. మహిళలకు 155 సెంటీమీటర్ల ఎత్తు అవసరం.
వేతన శ్రేణి : రూ. 21,700 నుంచి రూ. 69,100(పే లెవల్ 3).
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేదీ : ఆగస్టు 23.
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 150(with GST) దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక విధానం : ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు.
అప్లికేషన్, పూర్తి వివరాలకోసం https://rectt.bsf.gov.in/#bsf-current-openings వెబ్‌సైట్‌లో సంప్రదించాలి.