అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Job Notifications | ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు (DSSSB) వివిధ శాఖలు, స్వయం ప్రతిపత్తిగల సంస్థలు, స్థానిక సంస్థల్లో గ్రూప్ బీ, గ్రూప్ సీ ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టింది. 2,119 పోస్టుల(2119 Posts) భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో టీచింగ్, మెడికల్, టెక్నికల్ పోస్టులు కూడా ఉన్నాయి. నోటిఫికేషన్(Notification) వివరాలిలా ఉన్నాయి.
పోస్టులవారీగా వివరాలు..
భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 2,119
వార్డెన్(పురుషులు) : 1,676
పీజీటీ ఇంగ్లిష్ (పురుషులు/మహిళలు) : 93
మలేరియా ఇన్‌స్పెక్టర్ : 37
డొమెస్టిక్ సైన్స్ టీచర్ : 26
ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ : 120
టెక్నీషియన్ (ఒపిఎథ్) : 70
ల్యాబ్ టెక్నిషియన్ : 30
ఫార్మసిస్ట్ (ఆయుర్వేద) : 19
సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్లు : 2
విద్యార్హతలు: పోస్టును బట్టి పదో తరగతి(Tenth class), డిప్లొమా, డిగ్రీ(Degree), పీజీ, బీఈడీ/బీఏఈడీ/ఎంఈడీ వంటి విద్యార్హతలు అవసరం. సంబంధిత రంగంలో ఉద్యోగ అనుభవం కూడా పరిశీలిస్తారు.
వయో పరిమితి: పోస్టును బట్టి 18 ఏళ్ల నుంచి 32 ఏళ్లలోపువారు అర్హులు.
వేతన వివరాలు :
లెవల్ 2 ఉద్యోగాలకు రూ.19,900 నుంచి రూ.63,200.
లెవల్ 8 ఉద్యోగాలకు రూ.47,600 – రూ.1,51,100.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 7.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT) నిర్వహిస్తారు. అవసరమైన పోస్టులకు ఫిజికల్/స్కిల్/ట్రేడ్ టెస్టులుంటాయి. దరఖాస్తు, పూర్తి వివరాలకు https://dsssb.delhi.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించాలి.