అక్షరటుడే, వెబ్‌డెస్క్:Railway Jobs | వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకానమిక్ సర్వీస్ (RITES) నోటిఫికేషన్ జారీ చేసింది. టెక్నిషియన్, ఫీల్డ్ ఇంజినీర్, సైట్ అసెసర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
Railway Jobs | అర్హతలు..
రెండు టెక్నిషియన్, ఆరు ఫీల్డ్ ఇంజినీర్, ఆరు సైట్ అసెసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. టెక్నిషియన్ పోస్టుకు ఫిజిక్స్, కెమిస్ట్రీలో బీఎస్సీ, ఫీల్డ్ ఇంజినీర్, సైట్ అసెసర్ పోస్టులకు ఎలక్ట్రికల్, ఎలక్ట్రీషియన్ పవర్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రీషియన్ మెకానిక్స్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్స్, టెక్నీషియన్ పవర్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్, ఎలక్ట్రీషియన్ విభాగాల్లో ఐటీఐ(ITI) చేసిన వారు అర్హులు. అభ్యర్థుల గరిష్ట వయో పరిమితి 40 ఏళ్లు కాగా, ప్రభుత్వ నిబంధనల మేరకు ఆయా వర్గాలకు సడలింపు ఉంటుంది.
Railway Jobs | రాత పరీక్ష ద్వారా ఎంపిక..
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు మే 19 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ(SC), ఎస్టీ(ST), పీడబ్ల్యూడీ(PWD) అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఇతరులు రూ.300 చెల్లించాలి. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. మొత్తం 125 ప్రశ్నలుంటాయి. పరీక్షా సమయం 2.30 గంటలు. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు అదనంగా 50 నిమిషాలు ఇస్తారు. అన్ రిజర్వ్‌డ్(Unreserved), ఈడబ్ల్యూఎస్(EWS) అభ్యర్థులకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు 45 శాతం మార్కులు సాధిస్తేనే సర్టిఫికేషన్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. మరిన్ని వివరాలకు www.rites.comలో సంప్రదించవచ్చు.