HomeUncategorizedPowergrid Jobs | ‘పవర్‌గ్రిడ్‌’లో ఉద్యోగావకాశాలు

Powergrid Jobs | ‘పవర్‌గ్రిడ్‌’లో ఉద్యోగావకాశాలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Powergrid Jobs | ఫీల్డ్‌ ఇంజినీర్‌, సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీ కోసం పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(PGCIL) నోటిఫికేషన్‌(Notification) విడుదల చేసింది. ఆసక్తిగలవారినుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టులు, అర్హతల వివరాలిలా ఉన్నాయి.

భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 1,543
పోస్టుల వివరాలు..
ఫీల్డ్‌ ఇంజినీర్‌(ఎలక్ట్రికల్‌) : 532
ఫీల్డ్‌ ఇంజినీర్‌(సివిల్‌) : 198
ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌(ఎలక్ట్రికల్‌) : 535
ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌(సివిల్‌) : 193
ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌(ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌) : 85

విద్యార్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీనుంచి సంబంధిత విభాగంలో 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌/డిప్లొమా/ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం అవసరం.
వయో పరిమితి : ఈ ఏడాది సెప్టెంబర్‌ 17 నాటికి 29 ఏళ్లలోపు వారు అర్హులు.
పేస్కేల్‌ : ఫీల్డ్‌ ఇంజినీర్‌కు రూ. 30 వేలనుంచి రూ. 1.20 లక్షల వరకు, ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌(Field Supervisor)కు రూ. 23 వేలనుంచి రూ. 1.05 లక్షల వరకు వేతనం ఉంటుంది.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ ద్వారా..
దరఖాస్తుకు చివరి తేదీ : సెప్టెంబర్‌ 17.
ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు.
పరీక్ష కేంద్రాలు : Delhi, ముంబయి, బెంగళూరు, భోపాల్‌, కోల్‌కతా, గువహటి.
పరీక్ష తేదీలను ఇంకా ప్రకటించలేదు. సంస్థ వెబ్‌సైట్‌లో పరీక్ష, ఇంటర్వ్యూ తేదీలను ప్రకటిస్తారు. పూర్తి వివరాలు, దరఖాస్తు కోసం సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ https://www.powergrid.in/ ను సంప్రదించండి.

Must Read
Related News