అక్షరటుడే, వెబ్డెస్క్ : ONGC Recruitment | అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్, ఐటీఐ, డిగ్రీ అర్హతలతో ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ONGC) 2,623 అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్(Notification)ను జారీ చేసింది. పూర్తి వివరాలిలా ఉన్నాయి.
భర్తీ చేసే పోస్టులు : 2,623
విద్యార్హత : డిగ్రీ(Degree), డిప్లొమా, ఐటీఐ, పదో తరగతి.
వయో పరిమితి : 18 -24 ఏళ్ల మధ్య వయసువారు అర్హులు.
వేతనం : గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు నెలకు రూ. 12,300 చెల్లిస్తారు. మూడేళ్ల డిప్లోమా చేసినవారికి రూ. 10,900, పదో తరగతి(Tenth class), పన్నెండో తరగతి పూర్తి చేసినవారికి రూ. 8,200, ఏడాది ఐటీఐ పూర్తి చేసినవారికి రూ. 9,600, రెండేళ్ల ఐటీఐ(ITI) పూర్తి చేసినవారికి 10,560 ఇస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా..
దరఖాస్తు గడువు : నవంబర్ 11.
ఎంపిక విధానం : అర్హత పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. సమాన మార్కులు పొందిన సందర్భంగా వయసు ఎక్కువ గల అభ్యర్థికి ప్రాధాన్యం ఇస్తారు.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీవోడబ్ల్యూడీ కేటగిరీలకు నిబంధనల ప్రకారం రిజర్వేషన్(Reservation) వర్తిస్తుంది.
దరఖాస్తు, పూర్తి వివరాలకు వెబ్‌సైట్ https://www.ongcapprentices.in లో సంప్రదించగలరు.