అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Job opportunities | ఎలక్ట్రీషియన్‌తో (Electrician) పాటు పలు టెక్నికల్ పోస్టుల భర్తీ కోసం మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ (MOIL) నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చేనెల ఆరో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. నోటిఫికేషన్ (Notification) వివరాలిలా ఉన్నాయి.
భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 142. (ఎలక్ట్రీషియన్, మెకానిక్ కం ఆపరేటర్, మైన్ ఫోర్‌మన్, సెలెక్షన్ గ్రేడ్ మైన్ ఫోర్‌మన్, మైన్‌మెట్(Mine Mate), బ్లాస్టర్ తదితర పోస్టులున్నాయి)
విద్యార్హత : పదో తరగతి, ఐటీఐ, బీఈ(B.E.) లేదా బీటెక్(ఎలక్ట్రీషియన్) పూర్తి చేసి పని అనుభవం ఉన్నవారు అర్హులు. మైన్‌ఫోర్‌మన్ సర్టిఫికెట్ అవసరం.
వయో పరిమితి : నవంబర్ 6వ తేదీ నాటికి 30 నుంచి 45 ఏళ్ల మధ్య వయసువారు దరఖాస్తు చేసుకోవాలి. నిబంధనల మేరకు ఆయా వర్గాల వారికి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
Job opportunities | వేతనం..
ఎలక్ట్రీషియన్ గ్రేడ్ -3, మెకానిక్ కం ఆపరేటర్‌గ్రేడ్ – 3(ఫిట్టర్), మెకానిక్ కం ఆపరేటర్ గ్రేడ్ – 3(వెల్డర్)
పోస్టులకు నెలకు రూ. 23,400 – రూ. 42,420.
మైన్ ఫోర్‌మన్ – 1 పోస్టులకు రూ. 26,900 – రూ. 48,770.
సెలెక్షన్ గ్రేడ్ మైన్ ఫోర్‌మన్ పోస్టులకు రూ. 27,600 – రూ. 50,040.
మైన్‌మెట్ గ్రేడ్ – 1 పోస్టులకు రూ. 24,800 – రూ. 44,960.
బ్లాస్టర్ గ్రేడ్-2 పోస్టులకు రూ. 24,100 – రూ. 43,690.
ట్రైనీ మైన్‌మెట్ గ్రేడ్ – 2 పోస్టులకు రూ. 24,100 – రూ. 43,690.
ట్రైనీ బ్లాస్టర్ గ్రేడ్-2 పోస్టులకు రూ. 23,400 – రూ. 42,420.
- దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా..
- దరఖాస్తు రుసుము : జనరల్(General), ఈడీఎల్‌ఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ. 295 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు దరఖాస్తు రుసుము లేదు.
- దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 6.
- పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్(Hyderabad), చెన్నై, నాగ్‌పూర్, బెంగళూరు, ముంబయి, థానె, ఢల్లీి, కోల్‌కతా, భోపాల్, రాయ్‌పూర్.
- ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష, ఇంటర్వ్యూలలో మెరిట్ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్ https://www.moil.nic.in/ లో సంప్రదించగలరు.