అక్షరటుడే, వెబ్‌డెస్క్: IOCL Notifications | ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఐవోసీఎల్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ అయ్యింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులనుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్ వివరాలిలా ఉన్నాయి.
పోస్టుల వివరాలు..
నాన్‌ఎగ్జిక్యూటివ్ పర్సనల్ (Non-Executive Personnel) పోస్టులు 394 భర్తీ చేయనున్నారు.
విభాగాల వారీగా ఖాళీలు..
జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్-IV(ప్రొడక్షన్) : 232
జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్-IV(పీఏయూ) : 37
జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్-IV(పీఅండ్యూ, ఓఅండ్ఎం) : 22
జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్-IV(ఎలక్ట్రికల్)/జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్-IV (ఎలక్ట్రికల్) : 12
జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్-IV(మెకానికల్)/జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్-IV (మెకానికల్) : 14
జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్-IV(ఇన్స్ట్రుమెంటేషన్) / జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్-IV (ఇన్స్ట్రుమెంటేషన్) : 06
జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్- IV : 20
జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్-IV(ఫైర్ సేఫ్టీ) : 51
విద్యార్హతలు : సంబంధిత సబ్జెక్టులలో మూడేళ్ల డిప్లొమా (Diploma) లేదా డిగ్రీ.
వయోపరిమితి : 18 నుంచి 26 ఏళ్లలోపువారు అర్హులు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ జనరల్‌కు పదేళ్లు, పీడబ్ల్యూబీడీ ఎస్సీ/ఎస్టీలకు 15 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ ఓబీసీలకు 13 ఏళ్ల వరకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
పే స్కేల్ : రూ. 25,000 – రూ. 1,05,000.
దరఖాస్తు గడువు : జనవరి 9, 2026 రాత్రి 11:59 గంటల వరకు.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా..
ఫీజు- జనరల్ /ఈడబ్ల్యూఎస్ /ఓబీసీ అభ్యర్థులు రూ.300 ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/మాజీ సైనికులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం : కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. నైపుణ్యం లేదా ప్రావీణ్యత లేదా శారీరక పరీక్ష ఉంటాయి.
దరఖాస్తు, పూర్తి వివరాల కోసం https://iocl.com/ వెబ్సైట్లో సంప్రదించగలరు.