HomeజాతీయంIndia Post Notification | ఇండియా పోస్ట్‌ నుంచి జాబ్‌ నోటిఫికేషన్‌

India Post Notification | ఇండియా పోస్ట్‌ నుంచి జాబ్‌ నోటిఫికేషన్‌

ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ నిరుద్యోగులకు శుభవార్త అందించింది. గ్రామీణ డాక్‌ సేవక్‌ పోస్టుల భరీ కోసం నోటిఫికేషన్‌ రిలీజ్​ చేసింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : India Post Notification | నిరుద్యోగులకు ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌(India Post Payments Bank) శుభవార్త అందించింది. గ్రామీణ డాక్‌ సేవక్‌ (ఎగ్జిక్యూటివ్‌) పోస్టుల భరీ కోసం నోటిఫికేషన్‌(Notification) విడుదల చేసింది.

దేశవ్యాప్తంగా మొత్తం 348 గ్రామీణ డాక్‌ సేవక్‌ (ఎగ్జిక్యూటివ్‌) పోస్టుల భరీ కోసం ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌(IPPB) నోటిఫికేషన్‌ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్‌ వివరాలిలా ఉన్నాయి.

పోస్ట్‌ల వివరాలు : గ్రామీణ డాక్‌ సేవక్‌ (ఎగ్జిక్యూటివ్‌) 348 పోస్టులు.
విద్యార్హత : ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ(Degree).
వయోపరిమితి : 20 నుంచి 35 ఏళ్లలోపు వారు అర్హులు.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ ద్వారా..
దరఖాస్తు గడువు : 29-10-2025

ఎంపిక విధానం : మెరిట్‌(Merit) జాబితాను బ్యాంకింగ్‌ ఔట్‌లెట్‌ వారీగా రూపొందిస్తారు. గ్రాడ్యుయేషన్‌లో సాధించిన మెరిట్‌ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. అవసరమైతే ఆన్‌లైన్‌ టెస్ట్‌ కూడా నిర్వహించే అధికారం బ్యాంకుకు ఉంది.

ఒకవేళ ఇద్దరు అభ్యర్థులు సమానమైన గ్రాడ్యుయేషన్‌ పర్సంటేజీ మార్కులు సాధించినట్లయితే డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పోస్ట్‌లో సీనియారిటీ ఉన్న అభ్యర్థిని ఎంపిక చేస్తారు. సీనియారిటీ కూడా సమానంగా ఉంటే పుట్టిన తేదీ ఆధారంగా ప్రాధాన్యత ఉంటుంది. బోర్డు/విశ్వవిద్యాలయం కేవలం గ్రేడ్‌లు (GPA /CGPA) మాత్రమే ఇచ్చినట్లయితే ఆ మార్కులను కళాశాల/విశ్వవిద్యాలయం అందించిన ఫార్ములా ప్రకారం ఖచ్చితమైన శాతం మార్కులుగా మార్చి దరఖాస్తులో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులో మార్కుల శాతంలో ఏదైనా వ్యత్యాసం కనిపిస్తే దానిని తిరస్కరిస్తారు.

డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ : దరఖాస్తు చేసే సమయంలో అభ్యర్థులు తమ మాతృ సంస్థ నుంచి ఎన్‌ఓసీ(నిరభ్యంతర పత్రం) పొందాలి. ధ్రువపత్రాల పరిశీలన సమయంలో, అభ్యర్థులు ఐదేళ్లలో తమపై విధించిన పెద్ద/చిన్న శిక్షల వివరాలు మరియు డివిజనల్‌/సబ్‌ డివిజనల్‌ హెడ్‌ నుంచి పొందిన విజిలెన్స్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.

పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ https://www.ippbonline.com/ లో సంప్రదించగలరు.