అక్షరటుడే, ఇందూరు: Job Mela | జిల్లాలోని నిరుద్యోగులకు ఈనెల 8న ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి (District Employment Officer) మధుసూదన్ రావు తెలిపారు. అపోలో ఫార్మసీ (Apollo Pharmacy), వరుణ్ మోటార్స్(Varun Motors) కంపెనీలో ఫార్మసిస్ట్, ట్రెయినీ ఫార్మసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్, అడ్వైజర్, క్యాషియర్, ఫ్లోర్ సూపర్వైజర్, రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. డీ, బీ, ఎం ఫార్మసీ, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ చేసినవారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జిల్లా కేంద్రంలోని శివాజీనగర్‌లో ఉన్న జిల్లా ఉపాధి కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలకు 9948748428, 99594 56793 కు సంప్రదించాలని కోరారు.
