అక్షరటుడే, ఇందూరు: Job Mela | జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు (Employment Officer Madhusudhan Rao) తెలిపారు. ముత్తూట్ ఫైనాన్స్‌లో (Muthoot Finance) ప్రొఫెషనరీ ఆఫీసర్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్, ఇంటర్న్‌షిప్ ట్రైయినీగా (Internship Trainee) ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ, ఎంబీఏ, ఎంకామ్ చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 12న ఉదయం 10:30 గంటలకు శివాజీ నగర్‌లోని ఉపాధి కల్పన కార్యాలయానికి హాజరుకావాలని పేర్కొన్నారు.