అక్షరటుడే, ఇందూరు: Care Degree College | నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో ‘మ్యాజిక్ బస్ ఇండియా’ (Magic Bus India) ఆధ్వర్యంలో జులై 2న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. ముత్తూట్ ఫైనాన్స్, అపోలో, యాక్సిస్ బ్యాంక్ తదితర కంపెనీలు హాజరవుతాయని పేర్కొన్నారు. 2019 నుంచి 2025 మధ్య డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 8688215980 సంప్రదించాలని తెలిపారు.
