అక్షరటుడే, వెబ్‌డెస్క్: Job Notification : మెగా DSCలో భాగంగా క్రీడా కోటా కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేపడుతోంది. ఈమేరకు 421 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు మే 2 నుంచి 31లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అర్హత కలిగిన క్రీడాకారులకు 3% హారిజాంటల్ రిజర్వేషన్‌తో సర్కారు కొలువులు ఇస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాత పరీక్ష లేకుండా క్రీడల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ, ZP, MPP బడుల్లో 333 పోస్టులు, మిగతావి ఇతర పాఠశాలల్లో ఉన్నట్లు మంత్రి వివరించారు.