అక్షరటుడే, వెబ్‌డెస్క్: JK Police Station Explosion | జమ్మూకశ్మీర్‌లో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ్రీనగర్ సమీపంలో ఉన్న నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం అర్ధరాత్రి పేలుడు సంభవించింది.
ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఫోరెన్సిక్ సిబ్బందితోపాటు పోలీసులు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు.
JK Police Station Explosion | అర్ధరాత్రి సమయంలో..
శుక్రవారం రాత్రి 11.22 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించినంతగా భారీ శబ్దంతో పేలుడు జరిగింది. ఆ వెంటనే మంటలు ఒక్కసారిగా వ్యాపించాయని స్థానికులు చెబుతున్నారు.
ఠాణాను దట్టమైన పొగ కమ్మేసింది. పేలుడు తీవ్రతకు దాదాపు 300 మీటర్ల దూరం వరకు శరీర భాగాలు ఎగసిపడ్డాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఠాణాలో నిలిపి ఉంచిన వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. చుట్టూ ఉన్న భవనాలకు సైతం పగుళ్లు ఏర్పడ్డాయి
