Homeబిజినెస్​TRAI | జియోకు భారీగా పెరిగిన యూజర్లు

TRAI | జియోకు భారీగా పెరిగిన యూజర్లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TRAI | టెలికాం రంగంలో జియో (JIO) దూసుకుపోతుంది. మే నెలలో రికార్డు స్థాయిలో యూజర్లను ఈ సంస్థ పెంచుకోవడం గమనార్హం. 2025 మే నెలకు సంబంధించిన టెలికాం కంపెనీల సబ్​స్క్రైబర్ల వివరాలను ట్రాయ్​ (TRAI) తాజాగా విడుదల చేసింది.

TRAI | జియో వాటా 40.92శాతం

మే నెలలో జియో కొత్తగా 27 లక్షల యూజర్లను పెంచుకోవడం గమనార్హం. దీంతో ప్రస్తుతం టెలికాం మార్కెట్లో ఆ సంస్థ వాటా 40.92 శాతానికి పెరిగింది. దీంతో ప్రస్తుతం జియో వినియోగదారుల సంఖ్య 47.51 కోట్లకు చేరుకుంది. మరోవైపు ఎయిర్​టెల్ (Airtel) మే నెలలో 2.75 లక్షల కస్టమర్లను కొత్తగా యాడ్​ చేసుకుంది. మే 31 నాటికి, ఎయిర్‌టెల్ మొత్తం వినియోగదారుల సంఖ్య 39.02 కోట్లకు పెరిగింది. మార్కెట్​లో ఎయిర్​టెల్​ వాటా 33.61 శాతానికి చేరుకుంది.

TRAI | పడిపోయిన బీఎస్​ఎన్​ఎల్​, వీఐ కస్టమర్లు

జియో, ఎయిర్​టెల్​ కస్టమర్లను యాడ్​ చేసుకుంటూ.. మార్కెట్​లో వాటా పెంచుకుంటుంటే వొడాఫోన్ ఐడియా (VI), బీఎస్​ఎన్​ఎల్ (BSNL)​ మాత్రం తమ యూజర్లను కోల్పోయాయి. వొడాఫోన్​ ఐడియా 2.74 లక్షల వినియోగదారులను, బీఎస్​ఎన్​ఎల్​ 1.35 లక్షల కస్టమర్లను కోల్పోవడం గమనార్హం. ప్రస్తుతం వోడాఫోన్ ఐడియా 20.44 కోట్లు BSNL 9.07 కోట్ల వినియోగదారులను కలిగి ఉన్నాయి.

TRAI | మొత్తం యూజర్లు 116 కోట్లు

దేశంలో 2025 మే 31 నాటికి మొబైల్​ యూజర్ల సంఖ్య 116.84 కోట్లకు పెరిగింది. ఏప్రిల్‌లో 116.64 కోట్లు ఉండగా.. కొత్తగా ఒక నెలలోనే 20 లక్షల మంది కొత్త సిమ్​కార్డులు తీసుకున్నారు.