అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Recharg Plan | ప్రస్తుతం ఇంటర్నెట్ లేకుండా జీవితం ఊహించలేని పరిస్థితి. ఆన్లైన్ క్లాసులు, వర్క్ ఫ్రం హోమ్, వీడియో కాల్స్, స్ట్రీమింగ్, డాక్యుమెంట్ డౌన్లోడ్ వంటి ఎన్నో పనులు నిత్యం డేటా మీదే ఆధారపడి ఉంటున్నాయి.
అయితే, రోజువారీ డేటా లిమిట్ ముగిసినప్పుడు వినియోగదారులు తీవ్రమైన అసౌకర్యానికి గురవుతారు. ఇటువంటి సందర్భాల్లో తక్కువ ధరకు ఎక్కువ డేటాను అందించే ప్రత్యేక ప్లాన్లు(Special Plans) టెలికాం కంపెనీలు తీసుకొస్తున్నాయి.
Recharg Plan | జియో నుంచి రూ.40 డేటా ప్లాన్
జియో(Jio) తన యూజర్ల కోసం ప్రత్యేకంగా రూ.40 డేటా యాడ్-ఆన్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది 3 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ప్రతిరోజూ 3జీబీ హైస్పీడ్ డేటా లభించడంతో మొత్తం 9జీబీ డేటాను వినియోగదారులు పొందగలుగుతారు. ఆన్లైన్ క్లాసులు, ప్రాజెక్టులు, ట్రావెల్ సమయంలో తక్కువ రోజులకు అధిక డేటా అవసరమైన వారికి ఇది చక్కటి ఎంపిక. ఈ ప్లాన్‌ను MyJio యాప్ లేదా Jio అధికారిక వెబ్సైట్ ద్వారా యాక్టివేట్ చేయవచ్చు. అయితే, ఈ ప్లాన్ డేటా బేస్ ప్లాన్ వ్యాలిడిటీపై ఎలాంటి ప్రభావం చూపదు.
Recharg Plan | ఎయిర్టెల్ రూ.33 డేటా ప్లాన్
ఎయిర్టెల్ (Airtel) కూడా తన యూజర్ల కోసం రూ.33 ధరకు డేటా యాడ్-ఆన్ ప్లాన్‌ను అందిస్తోంది. ఇది ఒకే రోజు వాలిడిటీతో 2జీబీ డేటాను కలిగి ఉంటుంది. తాత్కాలిక అవసరాల కోసం, తక్కువ సమయంలో ఎక్కువ డేటా అవసరమైనప్పుడు ఇది ఉపయోగపడుతుంది.
Recharg Plan | జియోఫోన్ యూజర్లకు రూ.75 ప్లాన్
జియోఫోన్ వినియోగదారుల కోసం రూ.75 ప్లాన్ అందుబాటులో ఉంది. ఇందులో 23 రోజుల వాలిడిటీతో పాటు అపరిమిత కాల్స్, 50 ఎస్ఎంఎస్లు, రోజుకు 0.1జీబీ డేటా + 200ఎంబీ అదనపు డేటా లభిస్తుంది. మినిమం ధరకు బేసిక్ అవసరాలన్నీ అందిస్తుంది ఈ ప్లాన్.
Recharg Plan | స్మార్ట్‌ఫోన్ యూజర్లకు రూ.189 ప్లాన్
తక్కువ ధరకు ఎక్కువ వాలిడిటీ కోరుకునే స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు రూ.189 ప్లాన్ అనువైనది. 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్, 2జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్లు, జియో యాప్స్ యాక్సెస్ లభిస్తాయి. సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకునేందుకు ఇది సరైన ఎంపిక.
Recharg Plan | మరిన్ని డేటా యాడ్-ఆన్ ప్లాన్లు
డేటా మాత్రమే అవసరమయ్యే వారికి జియో JIO రూ.77తో 3జీబీ డేటా, రూ.100తో 5జీబీ డేటా ప్యాక్‌లను అందిస్తోంది. ఇవన్నీ MyJio యాప్‌లో ‘డేటా యాడ్-ఆన్’ విభాగంలో అందుబాటులో ఉంటాయి.