అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Jinka Tara Raju Campaign | మీ ఇంటి ఆడబిడ్డగా భావించి తనను కార్పొరేటర్‌గా గెలిపిస్తే అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తానని 16వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థిని (BRS Corporator Candidate) జింక తార రాజు అన్నారు. ఈ మేరకు కాలనీలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.
Jinka Tara Raju Campaign | మెజారిటీతో గెలిపించాలి..
ఈ సందర్భంగా ఆమె కాలనీలో పర్యటిస్తూ తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విన్నవించారు. బీఆర్ఎస్ (BRS) పాలనలో నగరంలో జరిగిన అభివృద్ధిని ప్రతి ఒక్కరికి వివరిస్తూ అదే స్పూర్తితో డివిజన్‌ను సైతం అభివృద్ధి చేస్తానని ఆమె మాటిచ్చారు. ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరికి అందేలా చూస్తానని ఆమె హామీ ఇచ్చారు.
పోరాడైనా నిధులు సాధిస్తాం..
డివిజన్‌కు రావాల్సిన నిధులతో పాటు అదనపు నిధులను కోసం కూడా పోరాడుతానన్నారు. మాలిక సదుపాయాల కల్పనలో ముందుంటామని ఆమె హామీ ఇచ్చారు. తమను నమ్మి ఒక్కసారి కార్పొరేటర్‌గా అవకాశం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు (BRS Leaders) కార్యకర్తలు పాల్గొన్నారు.