అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jersey auction | ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ భారత క్రికెట్‌కు కీలక మలుపు అనే చెప్పాలి. రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ, ఆర్.అశ్విన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా వంటి దిగ్గజాలు జట్టు నుండి దూరమైన తర్వాత, భారత టెస్ట్ జట్టు భవిష్యత్తు ఏంటి.. అని చాలామందిలో అనుమానాలు మొదలయ్యాయి.
టెస్ట్ క్రికెట్లో భారత్ రాణిస్తుందా అనే ఆలోచనలు చేశారు. అయితే, శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని యువ జట్టు అందరి అంచనాలను తిప్పికొట్టింది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసింది.
కొన్ని మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూసినా, చివరి టెస్టులో అద్భుతంగా పుంజుకుని సీరీస్‌ను సమం చేసింది. తరచూ గాయాల బారిన పడుతూ, తమ ప్రతిభను కనబరిచిన గిల్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్ తదితరులు జట్టుకు సత్తా చాటారు. గిల్ కెప్టెన్‌గా తన అద్భుతమైన నాయకత్వాన్ని నిరూపించుకున్నాడు.
Jersey auction | మంచి పని కోసం..
ఈ విజయంతో భారత యువజట్టుపై అభిమానులు ప్రశంసలు కురిపించారు. కుర్రాళ్లు అదరగొట్టారంటూ కామెంట్స్ చేశారు. అయితే తాజాగా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో పాల్గొన్న ఆటగాళ్ల జెర్సీలను రెడ్‌రూత్ టైమ్డ్ వేలంలో ప్రదర్శించగా.. వాటికి విపరీతమైన స్పందన వచ్చింది.
కెప్టెన్ గిల్ జెర్సీ అత్యధికంగా రూ. 5.41 లక్షలకు అమ్ముడైంది. గిల్ ఈ సిరీస్‌లో ఒక డబుల్ సెంచరీతో పాటు మూడు సెంచరీలు చేసి మొత్తం 754 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. గిల్ తర్వాత జడేజా Jadeja, బుమ్రా జెర్సీలు రూ. 4.94 లక్షలకు, రిషబ్ పంత్ జెర్సీ రూ. 4 లక్షలకు అమ్ముడయ్యాయి. ఇంగ్లాండ్ ఆటగాళ్లలో జో రూట్ జెర్సీ రూ. 4.47 లక్షలు, బెన్ స్టోక్స్ జెర్సీ రూ. 4 లక్షలు పలికాయి.
ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తం, రూత్ స్ట్రాస్ ఫౌండేషన్‌కు విరాళంగా అందించనున్నారు. ఈ సిరీస్ భారత యువ క్రికెటర్లకు క్రేజ్‌ను, అభిమానులకు గర్వాన్ని, జట్టుకు భవిష్యత్తులో ధైర్యాన్ని అందించింది. వాస్తవానికి ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ భార్య రూత్ స్ట్రాస్ 2018లో క్యాన్సర్‌తో కన్నుమూసింది.
అయితే రూత్ మరణం తర్వాత, ఆండ్రూ స్ట్రాస్ తన భార్య జ్ఞాపకార్థం రూత్ స్ట్రాస్ అనే ఫౌండేషన్‌ను Foundation స్థాపించి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి, డబ్బు లేని పిల్లలందరికీ ఆర్థికంగా సహాయం చేస్తుంటారు. ఇప్పుడు వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని రూత్ స్ట్రాస్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇవ్వనున్నారు.