అక్షరటుడే, ఆర్మూర్: Maganti Gopinath | జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపట్ల బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా.. మూడుసార్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజలకు ఎంతో సేవ చేశారని ఆయన వివరించారు. యువనేతగా.. సినీ నిర్మాతగా ఆయన ఎన్నో విజయాలు సాధించారన్నారు. గోపీనాథ్ మృతి పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు.
