అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jagtial Congress | జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్‌రెడ్డి (Jeevan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు ఎవడివిరా అంటూ రా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జగిత్యాల కాంగ్రెస్‌లో కొంతకాలంగా వర్గపోరు నడుస్తున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ (BRS party) నుంచి గెలిచిన సంజయ్‌కుమార్ (Jagtial MLA Sanjay Kumar) కాంగ్రెస్‌లో చేరడంతో వివాదం మొదలైంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్‌రెడ్డిని కాదని సంజయ్ సొంతంగా నిర్ణయాలు తీసుకోవడంతో ఇద్దరి మధ్య వివాదం ముదిరింది. పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని జీవన్‌రెడ్డి కొంతకాలంగా ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా యన కీలక వ్యాఖ్యలు చేశారు.
Jagtial Congress | మున్సిపల్ ఎన్నికల వేళ
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మున్సిపల్ ఎన్నికలు (municipal elections) నిర్వహించడానికి సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో జగిత్యాలలో టికెట్ల విషయంలో మరోసారి జీవన్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నడూ కాంగ్రెస్ జెండా మోయని వారు పార్టీ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో కథ తేలుతుందన్నారు. అసలు పార్టీ టికెట్ ఇవ్వడానికి నువ్వు ఎవరని ఎమ్మెల్యేను ఉద్దేశించి ప్రశ్నించారు.
Jagtial Congress | గెలుపే లక్ష్యంగా..
జగిత్యాల మున్సిపాలిటీలో 50 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామని జీవన్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం తెలియని వాళ్లకు టికెట్లు ఇస్తానని అనడం హాస్యాస్పదం అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంగట్లో సరుకు కాదన్నారు. తాము పదేళ్లు కాంగ్రెస్ జెండా మోశామన్నారు. కార్యకర్తలు అహర్నిశలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని పని చేశారన్నారు. వారికే టికెట్లు ఇస్తామన్నారు. ఎవరికి పడితే వారికి టికెట్లు ఇస్తే ఊరుకోమని హెచ్చరించారు. ప్రభుత్వ అభివృద్ధి పనులు నచ్చి కాంగ్రెస్‌లో చేరానని సంజయ్ అనడంపై పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అన్నారు.