HomeతెలంగాణJeevan Reddy | జూబ్లీ హిల్స్‌లో జీవన్‌రెడ్డి ప్రచారం

Jeevan Reddy | జూబ్లీ హిల్స్‌లో జీవన్‌రెడ్డి ప్రచారం

జూబ్లిహిల్స్​లో ఉప ఎన్నిక సందర్భంగా బీఆర్​ఎస్​ ప్రచారం జోరందుకుంది. ఈ మేరకు ఆర్మూర్​ మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి బస్సులో ప్రచారం నిర్వహించారు.

- Advertisement -

అక్షర టుడే, ఆర్మూర్‌: Jeevan Reddy | జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక (Jubilee Hills by-election) నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి (Asanna Gari Jeevan Reddy) సోమవారం ప్రచారం నిర్వహించారు.

పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్‌కు మద్దతుగా జూబ్లీ హిల్స్‌ నియోజకవర్గంలోని (Jubilee Hills constituency) షేక్‌ పేట్‌ డివిజన్‌ పరిధిలోని పారామౌంట్‌ గేట్‌ నెంబర్‌ 1లో ఇంటింటి ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి సునీత గోపినాథ్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్‌ బాకీ కార్డులను పంపిణీ చేస్తూ షేక్‌ పేట్‌ డివిజన్‌ పరిధిలోని 20,21,22,40,41,42 బూత్‌లో ప్రచారం నిర్వహించారు.