అక్షరటుడే, ఇందూరు : JEE Mains | జిల్లా కేంద్రంలోని అర్సపల్లిలో ఉన్న ఏవీ ఎంటర్ప్రైజెస్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సెంటర్లో జేఈఈ మెయిన్స్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. సీసీ కెమెరా నడుమ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహిస్తున్నారా.. సరిపడా పోలీస్ బందోబస్తు ఉందా.. అనే వివరాలు తెలుసుకున్నారు.
JEE Mains | లోటుపాట్లు లేకుండా..
ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని, విద్యార్థులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ నిర్వాహకులకు సూచించారు. కాగా.. మొత్తం 175 మంది విద్యార్థులకు గాను.. ఉదయం పరీక్షకు 173 మంది, మధ్యాహ్నం సెక్షన్ పరీక్షకు 171 మంది హాజరయ్యారని కేంద్ర నిర్వాహకులు తెలిపారు. కలెక్టర్ వెంట కేంద్రం అబ్జర్వర్ శ్రీకాంత్ (Central Observer Srikanth), సెంటర్ ఇన్ఛార్జి జావిద్, నార్త్ తహశీల్దార్ విజయ్ కాంత్ రావు (North Tahsildar Vijay Kanth Rao) తదితరులున్నారు.