అక్షరటుడే, వెబ్‌డెస్క్ : JEE Mains 2026 Results | విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న జేఈఈ మెయిన్స్ (JEE Mains) ఫలితాలు విడుదల అయ్యాయి. సోమవారం పరీక్ష ఫలిలను ఎన్టీఏ (NTA) విడుదల చేసింది.
జేఈఈ సెషన్ –1 పరీక్ష ఫలితాల కోసం కొంతకాలంగా విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. గురువారం ఫలితాలు విడుదల కావాల్సి ఉన్నా.. ఎన్టీఏ వాయిదా వేసింది. తాజాగా అధికారిక వెబ్సైట్లో రిజల్ట్స్ ఉంచింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం జేఈఈ పరీక్షలు రాస్తారు. ఐఐటీ, ఎన్ఐటీ వంటి ప్రముఖ కాలేజీల్లో సీట్ల కోసం జేఈఈ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జేఈఈ (JEE) సెషన్–1 పరీక్షలు జనవరి 21, 22, 23, 24, 28, 29 తేదీల్లో జరిగాయి.
JEE Mains 2026 Results | సెషన్ –2 పరీక్షలు
జేఈఈ పరీక్షలను ఎన్టీఏ రెండు సెషన్లలో నిర్వహిస్తోంది. ప్రస్తుతం తొలి విడుత ఫలితాలు విడుదల కాగా.. రెండో సెషన్ (Second session) పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 9 వరకు జరగనున్నాయి. దీనికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ నెల 25వ తేదీ రాత్రి 9గంటల వరకు విద్యార్థులు పరీక్ష కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
JEE Mains 2026 Results | ఫలితాలు ఎలా చూసుకోవాలి
JEE మెయిన్స్ ఫలితాలు అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.inలో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు వెబ్సైట్ ఓపెన్ చేసి JEE మెయిన్ స్కోర్‌కార్డ్ PDF లింక్‌పై క్లిక్ చేయాలి. లాగిన్ అయిన తర్వాత మెయిన్ స్కోర్‌కార్డ్ డౌన్లోడ్ లింక్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దానిని నొక్కి అప్లికేషన్ నెంబర్, పుట్టినతేదీ వివరాలను నమోదు చేసి స్కోర్ తెలుసుకోవచ్చు.
తెలుగు విద్యార్థుల ప్రతిభ
జేఈఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులకు సత్తా చాటారు. ఏపీకి జి.నరేంద్రబాబు, పసల మోహిత్ 100 పర్సెంటైల్ సాధించారు. OBC కేటగిరిలో జి.నరేంద్రబాబుకు మొదటి ర్యాంకు, SC కేటగిరిలో ఏపీ విద్యార్థి దేవ శ్రీవేద్కు మొదటి ర్యాంకు సాధించారు. తెలంగాణకు చెందిన వివన్ శరత్ మహేశ్వరికి 100 పర్సెంటైల్ వచ్చింది. దేశవ్యాప్తంగా మొత్తం 13.04 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 12 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ స్కోరుతో ప్రతిభ కనబరిచారు.