ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Army Jawan | జవాన్​ భూమి కబ్జా

    Army Jawan | జవాన్​ భూమి కబ్జా

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Army Jawan | దేశ సరిహద్దుల్లో మన రక్షణ కోసం పని చేసే జవాన్లకు రక్షణ కరువైంది. సరిహద్దుల్లో ఇతర దేశాల నుంచి మన భూ భాగాన్ని కాపాడుతున్న సైనికులు(Soldiers) తమ భూములను రక్షించుకోలేకపోతున్నారు. సైనికుల భూములను కొందరు కబ్జా చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరుసగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా శ్రీసత్యసాయి జిల్లా(Sri Satya Sai District) హుదుగూరులో ఆర్మీ జవాన్(Army Jawan)​ నరసింహమూర్తిభూమిని కొందరు కబ్జా చేశారు.

    Army Jawan | న్యాయం చేయాలని వినతి

    జమ్మూ(Jammu)లో పని చేస్తున్న నరసింహమూర్తి తనకు న్యాయం చేయాలని అక్కడి నుంచే వీడియో విడుదల చేశాడు.తన భూమి కబ్జా చేశారని అందులో వాపోయాడు. కబ్జాదారుల నుంచి తన భూమిని కాపాడాలని డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్(Deputy CM Pawan Kalyan)​, మంత్రి నారా లోకేశ్​(Minister Nara Lokesh)ను కోరారు. భూమి తనదేనని కోర్టు కూడా తీర్పు ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. అయితే కోర్టు తీర్పును రక్షించాల్సిన రెవెన్యూ అధికారులు(Revenue Officers), పోలీసులు(Police) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించాడు. మరోవైపు ఇటీవల సత్యసాయి జిల్లాలోనే మరో జవాన్​ సైతం తన భూమి కబ్జా అయిందని ఫిర్యాదు చేశాడు. గోరంట్ల మండలం రాగిమోలపల్లిలో తన భూమిని కబ్జా చేశారని ఆరోపించాడు. కాగా దేశం కోసం పోరాడుతున్న సైనికుల భూములను కబ్జా చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

    Latest articles

    Good Sleep | పడుకునే ముందు వీటిని తినొద్దు.. అనారోగ్య సమస్యలకు దారి తీయొచ్చు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Good Sleep | మన ఆరోగ్యం, జీవనశైలిలో నిద్ర చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది....

    APP Notification | ఏపీపీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : APP Notification | రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్​ వెలువడింది. 118 అసిస్టెంట్​...

    Nagaland Governor | నాగాలాండ్ గవర్నర్ గణేషన్ మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nagaland Governor | నాగాలాండ్ గవర్నర్ గణేషన్ (80) శుక్రవారం మృతి చెందారు. చెన్నైలోని...

    Israel | హమాస్ కీలక నేత హతం.. ప్రకటించిన ఇజ్రాయెల్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Israel | ఇజ్రాయెల్​, గాజా మధ్య యుద్ధం (Israel-Gaza War) కొనసాగుతూనే ఉంది. ఈ...

    More like this