అక్షరటుడే, వెబ్‌డెస్క్:Soldier | సైనికులు దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెడతారు. ఇటీవల ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) సమయంలో సైనికులు ధైర్య సాహసాలు ప్రదర్శించి శత్రుదేశంతో పోరాడారు. ఆ సమయంలో సామాన్యుడి నుంచి ప్రధాని(Prime Minister) దాకా ప్రతి ఒక్కరు సైనికుల సేవలను కొనియాడారు. భారత జవాన్లకు(Indian soldiers) సెల్యూట్ చేశారు. కానీ ఒక సైనికుడికి కష్టం వచ్చిందంటే మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు. తన భూమి కబ్జా అయిందని ఓ జవాను అధికారుల చుట్టూ తిరిగినా స్పందించడం లేదు.
సిద్దిపేట జిల్లా అక్బర్పేట మండలం చౌదర్‌పల్లికి చెందిన రామస్వామి భారత సైన్యం(Indian Army)లో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నాడు. దేశ రక్షణకు తన ప్రాణాలు పణంగా పెడుతున్న ఆయన తమ భూమికి కొందరు కబ్జా చేశారని వాపోయాడు. ఈ మేరకు సోషల్ మీడియా(Social Media)లో వీడియో పోస్ట్ చేశాడు. తమ గ్రామానికి చెందిన కొందరు తమ భూమిని కబ్జా చేశారని, తన తల్లిదండ్రులను బెదిరిస్తున్నారని పేర్కొన్నాడు.
Soldier | పట్టించుకోని అధికారులు
తన భూమి కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరితే అధికారులు పట్టించుకోవడం లేదని జవాన్ రామస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై తహశీల్దార్(Tahsildar), ఆర్డీవో(RDO)ను కలిసి ఫిర్యాదు చేశామన్నారు. కలెక్టర్‌ను కలిసిన స్పందించడం లేదన్నారు. కబ్జా చేసిన వ్యక్తి సోదరుడు రెవెన్యూ శాఖ పనిచేస్తాడని, అధికారులు వారికే సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించాడు. తమకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy)ని కోరారు.