అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Chhattisgarh | మావోయిస్టుల కోసం వేట కొనసాగిస్తున్న పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలో నక్సలైట్లు అమర్చిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (Improvised Explosive Device) పేలి సోమవారం ఛత్తీస్‌గఢ్ పోలీసుల డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ కు చెందిన ఓ జవాను మృతి చెందాడు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఇంద్రావతి జాతీయ ఉద్యానవనం ప్రాంతంలో ఉదయం DRG బృందం నక్సల్ వ్యతిరేక ఆపరేషన్(Anti Naxal Operation) చేస్తుండగా ఈ పేలుడు సంభవించిందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ పేలుడులో జవాన్ దినేష్ నాగ్ మరణించగా, ముగ్గురు గాయపడ్డారని తెలిపారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారిని ఆస్పత్రికి తరలిస్తున్నట్లు చెప్పారు.
Chhattisgarh | మావోల కోసం గాలిస్తుండగా..
ఇంద్రావతి నేషనల్ పార్కు(Indravati National Park) పరిసరాల్లో మావోల కదలికలపై సమాచారం అందడంతో గాలింపు చేపట్టారు. ఆదివారం నుంచి ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే, నక్సల్స్ అమర్చిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ పేలడంతో జవాను(Soldier) మృతి చెందాడు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. హుటాహుటిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఇటీవల కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. బీజాపూర్‌లో గురువారం జరిగిన IED పేలుడులో DRG సిబ్బంది గాయపడ్డారు. భైరామ్‌గఢ్ పోలీస్ స్టేషన్(Bhairamgarh Police Station) పరిధిలోని అదే ఇంద్రావతి అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) సంయుక్త బృందం మావోల కోసం గాలిస్తుండగా ఈపేలుడు సంభవించింది. DRGకి చెందిన సబ్-ఇన్‌స్పెక్టర్ ప్రకాశ్ చట్టి ప్రమాదవశాత్తు ఒత్తిడితో కూడిన IEDని కాలు వేయడంతో పేలుడు సంభవించింది. అతని కుడి చీలమండకు గాయాలయ్యాయి. గాయపడిన అధికారికి సంఘటన స్థలంలో ప్రథమ చికిత్స అందించిన అనంతరం ఆస్పత్రికి తరలించారు. జూన్ 9న కూడా సుక్మా జిల్లాలో ఇలాగే పేలుడు జరిగి పోలీసు సూపరింటెండెంట్ (కొంటా డివిజన్) ఆకాశ్‌రావు గిరేపుంజే మృతి చెందారు.