Homeక్రీడలుJasprit Bumrah | మాకూ కుటుంబాలున్నాయి.. వారి కోసం డ‌బ్బులు సంపాదించాలి: బుమ్రా

Jasprit Bumrah | మాకూ కుటుంబాలున్నాయి.. వారి కోసం డ‌బ్బులు సంపాదించాలి: బుమ్రా

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Jasprit Bumrah | టీమిండియా ఫేస్​ అస్త్రం బుమ్రా తాజాగా ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ టెస్టులకు గుడ్ బై చెప్పడంతో జట్టుకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రానే(Jasprit Bumrah) కెప్టెన్ అవుతాడని అంతా ఊహించారు. కానీ, యంగ్ బ్యాటర్ శుభ్​మన్​ గిల్ వైపు మొగ్గు చూపిన సెలక్షన్ కమిటీ అతడికి జట్టు పగ్గాలు అప్పగించింది. దీంతో సీనియర్ బుమ్రాను కాకుండా గిల్​కు(Shubhman Gill) నాయకత్వ బాధ్యతలు ఇవ్వడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. దీనిపై బుమ్రా తాజాగా స్పందించాడు. టెస్టు కెప్టెన్సీని తానే వద్దనుకున్నట్లు బుమ్రా చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ సమయంలోనే ఆ విష‌యం గురించి బీసీసీఐ(BCCI)తో మాట్లాడిన‌ట్టు పేర్కొన్నాడు. రీసెంట్​గా మాజీ ప్లేయర్ దినేశ్‌ కార్తీక్‌తో ఓ టీవీ కార్యక్రమంలో బుమ్రా ఈ వ్యాఖ్య‌లు చేశారు.

Jasprit Bumrah | పెద్ద కార‌ణాలు ఏమి లేవు..

తాను టెస్టు కెప్టెన్సీ(Captancy)ని తిరస్కరించడానికి కారణాలు చెప్పాడు. వర్క్ లోడ్ కారణంగానే కెప్టెన్సీ వద్దనుకున్నానని చెప్పాడు. నాయకత్వం కన్నా బౌలింగ్‌కే ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నట్లు వివరించాడు. ఐపీఎల్‌ సమయంలో రోహిత్, విరాట్ రిటైర్‌ కాకముందే నేను బీసీసీఐతో మాట్లాడాను. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌ల సిరీస్‌లో నా వర్క్​లోడ్​ గురించి చర్చించా. నా వెన్ను పరిస్థితి గురించి సంబంధిత వ్యక్తులతోనూ మాట్లాడాను. సర్జన్‌ను కూడా సంప్రదించాను. వర్క్​లోడ్​ విషయంలో ఎలా ఉండాలో వారు వివ‌రిస్తారు. వాళ్లతో చర్చించిన అనంతరం తర్వాత బీసీసీఐతో మాట్లాడా. కెప్టెన్సీ రేస్​లో నన్ను పరిగణనలోకి తీసుకోవద్దని చెప్పేశా అని బుమ్రా అన్నారు.

‘టెస్ట్ క్రికెట్‌ను వదిలేయాలనుకునే వారి నిర్ణయాన్ని గౌరవించాలి. రెడ్ బాల్ క్రికెట్‌లోని ఒత్తిడిని తట్టుకునేందుకు శరీరం సిద్ధంగా లేకపోతే తప్పుకోవడం ఉత్తమమని బుమ్రా అన్నారు.. టెస్ట్ క్రికెట్‌లో (Test Cricket) బౌలర్లు మరింత ఒత్తిడిని ఎదుర్కొంటారు. బౌలర్లు బ్యాట్ వెనుక దాక్కోలేరు. ఎంతో శ్రమ పడాల్సి ఉంటుంది. మనకూ కుటుంబాలు ఉన్నాయి. వారి కోసం డబ్బులు సంపాదించాలి. ఎవరైనా టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తే వారిని జడ్జ్ చేయడం ఆపాలి. అయితే టెస్ట్ క్రికెట్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిస్తే మీకు ప్రపంచవ్యాప్తంగా గౌరవం లభిస్తుంది అని బుమ్రా అన్నాడు. కొన్ని రోజుల క్రితం కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్ గురించి ఇలాంటి వ్యాఖ్యలే చేయ‌డం మనం చూశాం.