ePaper
More
    Homeఅంతర్జాతీయంJapan Prime Minister | త‌ప్పుకోనున్న జ‌పాన్ ప్ర‌ధాని.. పార్టీలో విభేదాల‌తో రాజీనామాకు నిర్ణ‌యం

    Japan Prime Minister | త‌ప్పుకోనున్న జ‌పాన్ ప్ర‌ధాని.. పార్టీలో విభేదాల‌తో రాజీనామాకు నిర్ణ‌యం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Japan Prime Minister | జపాన్ ప్రధాన మంత్రి షిగెరు ఇషిబా (Japan Prime Minister Shigeru Ishiba) రాజీనామా చేయ‌నున్నారు. అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP)లో నెలకొన్న అంత‌ర్గ‌త క‌ల‌హాల నేప‌థ్యంలో రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

    ఈ విష‌యాన్ని జ‌పాన్ అధికారిక టీవీ ఎన్‌హెచ్‌కే వెల్ల‌డించింది. అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ(Liberal Democratic Party)లో చీలికను నివారించే లక్ష్యంతో ఈ చర్య తీసుకున్నారని తెలిపింది. జూలైలో జ‌రిగిన‌ పార్లమెంటరీ ఎన్నికల్లో అధికార పార్టీ, సంకీర్ణ భాగస్వామి కొమైటో ఓటమి తర్వాత మెజార్టీ కోల్పోయింది. ఈ క్ర‌మంలో పార్టీలో విభేదాలు పొడ‌సూపడంతో ప్ర‌ధాని రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

    Japan Prime Minister | ఓటమి త‌ర్వాత విభేదాలు..

    పార్లమెంట్‌లో తన పార్టీకి భారీ ఎన్నికల ఎదురుదెబ్బ తగిలిన నెల రోజుల తర్వాత అపానీస్ ప్రధాన మంత్రి ఇషిబా షిగెరు ఆదివారం తన పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. జూలై ప్రారంభంలో జపాన్ పార్లమెంట్ (Japan Parliament) ఎగువ సభలో అధికార పార్టీ ఘోర ఓట‌మిని మూట‌గ‌ట్టుకుంది. మెజారిటీని సాధించడంలో విఫలమైన ప్ర‌ధాని ఇషిబా సామ‌ర్థ్యంపై అనుమానాలు పెరిగాయి. గతేడాది జ‌రిగిన పార్లమెంటు దిగువ సభలో కూడా పార్టీ మెజారిటీని సాధించడంలో విఫలమ‌య్యారు. రెండు స‌భ‌ల్లో మెజార్టీ కోల్పోయిన‌ప్ప‌టికీ రాజ‌కీయ ప్ర‌తిష్టంభ‌న‌ను నివారించ‌డానికి ప్ర‌ధానిగా కొన‌సాగుతాన‌ని ఇషిబా తెలిపారు.

    అమెరికా సుంకాల‌తో (America Tarrifs) పాటు ద్ర‌వ్యోల్బ‌ణం కార‌ణంగా ఆర్థిక వ్య‌వ‌స్థ దిగ‌జారింద‌ని, జాతీయ సంక్షోభం నెల‌కొన్న త‌రుణంలో రాజీనామా చేయడానికి నిరాక‌రించారు. ఓట‌మికి త‌నదే బాధ్య‌త అని అంగీకరించినప్పటికీ గ‌ద్దె దిగేందుకు ఆయ‌న ఒప్పుకోలేదు. ఈ నేప‌థ్యంలో ఎల్‌డీపీ కీల‌క స‌మావేశం నిర్వహించాల‌ని నిర్ణ‌యించ‌డంతో ఇషిబా పున‌రాలోచ‌న‌లో ప‌డ్డారు. పార్టీలో చీల‌క వ‌స్తుంద‌న్న భావ‌న ఏర్ప‌డడంతో ఆయ‌న రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న వార‌సుడు ఎవ‌ర‌నే దానిపై ఆస‌క్తి నెల‌కొంది.

    More like this

    BC Declaration | బీసీ రిజర్వేషన్లు అమలయ్యాకే స్థానిక ఎన్నికలకు వెళ్తాం: పీసీసీ చీఫ్​

    అక్షరటుడే, కామారెడ్డి: BC Declaration | బీసీ రిజర్వేషన్లు అమలయ్యాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామని పీసీసీ చీఫ్​ బొమ్మ...

    IRCTC | శివ‌భ‌క్తులకు రైల్వే గుడ్‌న్యూస్‌.. జ్యోతిర్లింగాల ద‌ర్శ‌నం ప్యాకేజీ ప్ర‌క‌ట‌న‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IRCTC | శివ భ‌క్తుల కోసం భారతీయ రైల్వే (Indian Railways) ఒక ప్రత్యేక...

    Sirnapally | సిర్నాపల్లి జలపాతం వద్ద సందర్శకుల సందడి

    అక్షరటుడే, ఇందల్వాయి: Sirnapally | ఇందల్వాయి (Indalwai) మండలం వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే ప‌ర్యాట‌కుల‌తో సంద‌డిగా క‌నిపిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా పర్యాటకులను...