అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Japan | భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టడానికి జపాన్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెలఖారులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) జపాన్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.5.9 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకోనున్నట్లు సమాచారం.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) ఇటీవల భారత్‌పై 50శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటుందనే కారణంతో భారత్‌పై ట్రంప్ టారిఫ్ (Trump Tariffs) లు వేశాడు. దీంతో భారత్ ఇతర దేశాలతో వాణిజ్యం పెంచుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో ఈ నెలాఖరులో ప్రధాని మోదీ జపాన్, చైనాలో పర్యటించనున్నారు. జపాన్ పర్యటనలో భాగంగా 68 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధిస్తారని తెలుస్తోంది. ఇరు దేశాలు ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలను పెంపొందించుకోవాలని చూస్తున్నాయి, అదే సమయంలో స్వేచ్ఛా, బహిరంగ ఇండో-పసిఫిక్ వాణిజ్యం ప్రోత్సహించాలని చూస్తున్నాయి.
Japan | మూడు రోజుల పర్యటన
ప్రధాని మోదీ ఆగస్టు 29 నుంచి మూడు రోజుల పాటు జపాన్‌లో పర్యటిస్తారు. 2023లో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశానికి హాజరైన తర్వాత ఆయన తొలిసారి జపాన్ వెళ్తున్నారు. జపాన్ ప్రధానమంత్రి షిగెరు ఇషిబా, మోదీ మధ్య శిఖరాగ్ర సమావేశ చర్చల తర్వాత పెట్టుబడులపూ ప్రకటన చేస్తారని సమాచారం. కొత్త పెట్టుబడి లక్ష్యంతో పాటు, ఆర్థిక రంగంలో సహకారాన్ని పెంచడానికి ఇరుదేశాలు ప్రయత్నిస్తున్నాయి. సెమీకండక్టర్లు, ముఖ్యమైన ఖనిజాలు, కమ్యూనికేషన్లు, క్లీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులపై ఇరు దేశాల అధినేతలు చర్చించనున్నారు.