అక్షరటుడే, వెబ్‌డెస్క్: Japan PM Sanae Takaichi | జపాన్ ప్రధాన మంత్రిగా సనాయే తకైచి ఎన్నికయ్యారు. ఆ దేశ చరిత్రలో ఓ మహిళ ప్రధానిగా ఎన్నిక కావడం ఇదే తొలిసారి. అతివాద నేతగా పేరున్న సనాయే తకైచి జపాన్ చరిత్రలో తొలి మహిళా ప్రధానిగా ఎన్నిక కావడం విశేషం.
పార్టీలో అంతర్గత విభేదాలు చోటుచేసుకోవడంతో జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా ఇటీవలే రాజీనామా చేశారు. దీంతో సనాయే తకైచి అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నుకోబడ్డారు.
జపాన్ ప్రధాని సనాయే తకైచికి భారత ప్రధానిత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. మిగతా దేశాధినేతలు కూడా శుభాకాంక్షలు తెలిపారు.
Japan PM Sanae Takaichi | ఇషిబా ఇటీవలే రాజీనామా..
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎగువ సభ ఎన్నికల్లో అధికార లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ మెజారిటీ సాధించలేకపోయింది. దిగువ సభలో అంతకు ముందే మెజారిటీ కోల్పోయింది.
అలా ఇషిబాపై తీవ్ర ఒత్తిడి పెరగడంతో తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో అక్టోబరు 4న పార్టీలో ఎన్నికలు నిర్వహించారు.
మాజీ ప్రధాని కుమారుడు షింజిరో కోయిజుమి, ఇంకా ముగ్గురు అభ్యర్థులను పక్కకు నెట్టి సనాయే తకైచి గెలుపొందారు.
పార్లమెంటులో మంగళవారం జరిగిన ఎన్నికలో జపాన్ ఇన్నోవేషన్ పార్టీ కూటమి, లిబరల్ డెమోక్రటిక్ పార్టీ మద్దతుతో సనాయే గెలుపొందారు. మొత్తం 465 ఓట్లలో సనాయే 237 ఓట్లు సాధించారు.