HomeUncategorizedJapan | జ‌పాన్‌లో 90 ల‌క్ష‌ల ఇళ్లు ఖాళీ.. వీళ్లంతా ఎటు పోయిన‌ట్టు..!

Japan | జ‌పాన్‌లో 90 ల‌క్ష‌ల ఇళ్లు ఖాళీ.. వీళ్లంతా ఎటు పోయిన‌ట్టు..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Japan | ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్న జపాన్‌లో (Japan) కొత్త సమస్య వచ్చిపడింది. ఆ దేశంలో ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. ఇది సమస్య ఎలా అవుతుందని ఆలోచిస్తున్నారా? తక్కువ జనన రేటుతో (birth rate) ఇప్పటికే జపాన్‌లో జనాభా (Japan population) తగ్గిపోతోంది. దేశంలో ఉన్న జనాభా కూడా ఇతర దేశాలకు వలస వెళ్లిపోతుండడంతో అక్కడ ఇళ్లన్నీ ఖాళీ అవుతున్నాయి. భూకంపాలు, సునామీల వంటి ప్రకృతి విపత్తుల దృష్ట్యా జనాలు వీటిని ఖాళీ చేసి వెళ్లిపోయారు. అభివృద్ధిలో మనకంటే ఎంతో ముందుండే జపాన్‌లో వృద్ధుల సంఖ్య కూడా అధికం.

Japan | ఎందుకు అలా..

అదిగాక వారి జీవనకాలమూ ఎక్కువే. కెరీర్‌లో పడి పిల్లలను కనకపోవటం వల్ల సదరు ఇంటివాళ్లు చనిపోతే ఆ ఇల్లు అనాథే. పిల్లలు ఇతర నగరాలకు, దేశాలకు వెళ్లిపోవటం వల్ల కూడా ఈ సమస్య ఉంది. ఇకపోతే జపాన్‌లో పన్నుల భారం వల్ల పాత ఇంటిని పునరుద్ధరించటం కన్నా కొత్త ఇల్లు (New House) కట్టుకోవటమే మేలు అనుకుంటారు. అందుకే కొన్ని ఇళ్లకు యజమానులు ఎవరో కూడా తెలియదట. అంటే ప్రభుత్వం యజమానుల వివరాలను రికార్డు చేయలేదు. పబ్లిక్‌ ట్రాన్స్‌ పోర్టుకు (public transport) ఆ ఇళ్లు దూరంగా ఉండటం లాంటి కారణాల వల్ల జపాన్‌ పల్లెల్లో గత ఇరవై ఏళ్ల నుంచి ఇలాంటి ఇళ్ల సంఖ్య పెరిగిపోయింది.

ఇప్పటిదాకా సుమారు 30 లక్షల మంది విదేశీయులు (3 million foreigners) జపాన్‌లోని ఈ పల్లెలను సందర్శించారట. ప్రస్తుతం ఇదోరకం టూరిజంలా మారింది. వాస్తవానికి ఇక్కడ ఇల్లు కొంటే తర్వాత అమ్మడం కూడా కష్టం. అందువల్లే ఈ సమస్య అంటున్నారు స్థానిక బిల్డర్లు. హషిమా ఐల్యాండ్‌, టోక్యోకు దగ్గరగా ఉండే కిజోజీ, నారా డ్రీమ్‌ ల్యాండ్‌, ర్యాబిట్‌ ఐల్యాండ్‌, కవాగుచి సిటీ.. లాంటి ప్రాంతాల్లో ఖాళీ ఇళ్లు (Empty houses) ఎక్కువగా కనిపిస్తాయి. రోజు రోజుకూ అక్కడ జనాభా తగ్గిపోతుంది. అలానే జపాన్‌లో రికార్డుస్థాయిలో ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్య 9 మిలియన్లకు చేరినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఖాళీ ఇళ్లను ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ పోతే ప్రపంచ ఆర్థిక రాజధాని న్యూయార్క్‌లో నగర జనాభాకు సరిపోతాయి. అక్కడ ఇలా ఖాళీగా వదిలేసిన ఇళ్లను ‘అకియా’ అంటారు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో దూరంగా నివాసాలను కూడా ఈ పేరుతోనే పిలిచేవారు.