అక్షరటుడే, వెబ్‌డెస్క్: Japan earthquake | న్యూఇయర్ సంబరాలకు సిద్ధమవుతున్న వేళ జపాన్ను Japan మరోసారి భారీ భూకంపం వణికించింది. కొద్ది రోజుల క్రితమే 7.5 తీవ్రతతో సంభవించిన భూకంప ప్రభావాల నుంచి దేశం కోలుకుంటున్న సమయంలోనే, తాజాగా నూతన సంవత్సర వేళ మరో బలమైన భూకంపం చోటుచేసుకోవడం ప్రజల్లో తీవ్ర ఆందోళనను కలిగించింది.
జపాన్ తూర్పు నోడా ప్రాంత తీరంలో రిక్టర్ స్కేల్‌పై 6.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అమెరికా జియాలజికల్ సర్వే (USGS) వెల్లడించింది. ఈ భూకంప కేంద్రం నోడా నగరానికి తూర్పున సుమారు 91 కిలోమీటర్ల దూరంలో, సముద్రమట్టానికి సుమారు 19.3 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
Japan earthquake | మరో భూకంపం…
భూకంప కేంద్రం లోతు తక్కువగానే ఉన్నప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఎటువంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని అధికారులు తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే భూకంపం ధాటికి పలు ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల Houses నుంచి బయటకు పరుగులు తీశారని స్థానిక మీడియా వెల్లడించింది.
ఇదిలా ఉంటే డిసెంబర్ నెల మొత్తం జపాన్ను వరుస భూకంపాలు వణికించాయి. డిసెంబర్ 8న 7.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా, డిసెంబర్ 12న 6.7 తీవ్రతతో మరో బలమైన భూకంపం చోటుచేసుకుంది. ఆ సందర్భాల్లో సునామీ Tsunami హెచ్చరికలు కూడా జారీ చేయడంతో తీర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ వరుస భూకంపాల కారణంగా జపాన్ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.
ప్రపంచంలోనే అత్యధికంగా భూకంపాలు సంభవించే దేశాల్లో జపాన్ ఒకటిగా నిలుస్తోంది. పసిఫిక్ బేసిన్‌ను చుట్టుముట్టిన అగ్నిపర్వతాలు, సముద్ర కందకాలతో కూడిన “రింగ్ ఆఫ్ ఫైర్” ప్రాంతంలో జపాన్ ఉన్న కారణంగా, ప్రపంచవ్యాప్తంగా 6.0 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో సంభవించే భూకంపాల్లో దాదాపు 20 శాతం వరకు జపాన్‌లోనే నమోదవుతాయి. సాధారణంగా ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి స్వల్ప భూకంపం సంభవిస్తుంటుందని నిపుణులు చెబుతున్నారు. న్యూఇయర్ వేళ సంభవించిన తాజా భూకంపంతో దేశవ్యాప్తంగా భద్రతా వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి.
టెక్టానిక్ రిడ్జ్ ప్రాంతంలో..
హిందూ మహాసముద్రంలోని Southeast Indian Ridge (టెక్టానిక్ రిడ్జ్ ప్రాంతం) ప్రాంతంలోనూ మరో భారీ భూకంపం సంభవించింది. ఈ రోజు (జనవరి 01 ) ఉదయం మహా సముద్రం Indian Ocean లోని దక్షిణ ప్రాంతంలో.. భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో 6.0 తీవ్రతతో భూకంపం ఏర్పడింది. ఇది సముద్ర మధ్య ప్రాంతం కావడంతో మానవ నివాసాలపై ప్రభావం చూపడం లేదు.