Homeతాజావార్తలుJanhvi Kapoor | ‘దేవర’తో తిరుగులేని హిట్.. కానీ జాన్వీ కపూర్‌కి రాని గుర్తింపు, ఇప్పుడు...

Janhvi Kapoor | ‘దేవర’తో తిరుగులేని హిట్.. కానీ జాన్వీ కపూర్‌కి రాని గుర్తింపు, ఇప్పుడు ‘పెద్ది’తో కొత్త టార్గెట్!

దేవరతో జాన్వీ కపూర్ టాలీవుడ్‌లో బలమైన అడుగు వేసింది. ఇప్పుడు ‘పెద్ది’తో స్టార్ హీరోయిన్‌గానే కాకుండా పర్ఫార్మెన్స్ ప‌రంగా గుర్తింపు తెచ్చుకోవ‌డం జాన్వీకి సవాల్​గా మారనుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Janhvi Kapoor | ఎంత గ్లామరస్‌గా కనిపించినా ఇండస్ట్రీలో Industry రాణించడం అంత సులువైన పని కాదు. ఇప్పటి సోషల్ మీడియా యుగంలో చాలామంది తమ టాలెంట్‌ను చూపించి సినిమా అవకాశాలు పొందుతున్నారు.

కానీ సినిమాల్లో స్థిరంగా నిలబడాలంటే ఒక్క సక్సెస్‌తో సరిపోదు .. సరైన కథలు, బలమైన పాత్రలు ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సక్సెస్ సాధించిన వాళ్లు చాలామంది ఉన్నా.. సినీ కుటుంబాల నుంచి వచ్చిన వారిపై మాత్రం అంచనాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఆ అంచనాలను మోస్తూ ముందుకు సాగాల్సిందే.

Janhvi Kapoor | ముందున్న స‌వాలు ఇదే..

సినీ కుటుంబం నుంచి ఇండస్ట్రీకి వచ్చిన వారిలో ఒకరు జాన్వీ కపూర్ (Janhvi Kapoor). ప్రముఖ నటి శ్రీదేవి – నిర్మాత బోని కపూర్ దంపతుల కుమార్తెగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. ప్రారంభంలో హిందీలో కొన్ని సినిమాలు చేసినా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసినా అవి ఆశించిన స్థాయి సక్సెస్ అందించలేదు. అయితే టాలీవుడ్‌లో ఆమెకు లభించిన అవకాశం గేమ్‌చేంజర్‌గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించిన ‘దేవర’ సినిమా భారీ విజయాన్ని సాధించింది. సినిమా బ్లాక్‌బస్టర్ అయినా, జాన్వీ కపూర్‌కు రావాల్సినంత గుర్తింపు మాత్రం రాలేదనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పుడు ఆమె దృష్టి మొత్తం రామ్ చరణ్ తేజ్ సరసన నటిస్తున్న ‘పెద్ది’ సినిమాపై ఉంది.

బుచ్చిబాబు (Buchi babu) సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. జాన్వీ ఈ సినిమాలో తన పాత్ర చాలా ప్రత్యేకమని ముందే వెల్లడించింది. ఈ చిత్రం విడుదలైన తర్వాత ఆమె మాటల విలువ తెలుస్తుందని అభిమానులు అంటున్నారు. అయితే చరణ్ పాత్రనే ఎక్కువగా హైలైట్ చేసేలా ఉన్నందున, జాన్వీకి వేరే ఫ్యాన్‌బేస్ సృష్టించగలదా అన్నది ప్రశ్నగానే ఉంది.

మరోవైపు రామ్ చరణ్ (Ram Charan) ‘రంగస్థలం’ వంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ ఏర్పరుచుకున్నాడు. ఇక జాన్వీ కపూర్ విషయానికి వస్తే ఆమె తల్లి శ్రీదేవి లాంటి లెజెండరీ స్థాయికి చేరాలంటే కచ్చితంగా కాన్సెప్ట్ బేస్, కంటెంట్ డ్రివ్ సినిమాలు ఎంచుకోవాలి. గ్లామర్‌కు మాత్రమే పరిమితం కాకుండా, భావోద్వేగం, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తే జాన్వీకి కొత్త దశ ప్రారంభమవుతుంది.

Must Read
Related News