అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Janhvi Kapoor | ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చలనచిత్ర ఉత్సవాల్లో ఒకటైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 Cannes Film Festival 2025 గత వారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వేడుకకి దేశ విదేశాలకి చెందిన నటీనటులు హాజరై సందడి చేశారు. వెరైటీ డ్రెస్సులలో ఒక్కొక్కరు హోయలు పోతూ తెగ సందడి చేశారు. అందరి చూపు తమవైపు పడేలా డిఫరెంట్ కాస్ట్యూమ్స్‌తో పాటు జ్యువెలరీ ధరించి వస్తున్నారు. హాలీవుడ్ నుంచి అనేక మంది టాప్ సెలబ్రిటీస్ అటెండ్ అవగా ఇప్పుడు బాలీవుడ్ నటీమణులు ఆ వేదికను మరింత కలర్‌ఫుల్‌గా మారుస్తున్నారు.
Janhvi Kapoor | కేక పెట్టించే లుక్..
తొలిసారి జాన్వీ కపూర్ కేన్స్‌లో సందడి చేసింది. జాన్వీ కపూర్ Janhvi Kapoor ,ఇషన్ కట్టర్ జంటగా నటించిన ‘హోమ్‌బౌండ్ Homebound సినిమా ప్రీమియర్ కోసం జాన్వీ కేన్స్‌లో తొలిసారి అడుగు పెట్టింది. ప్రముఖ డిజైనర్ తరుణ్ తహిలియానీ రూపొందించిన మెటాలిక్ పింక్ కలర్ ప్రీ-డ్రేప్డ్ సారీతో జాన్వీ రెడ్ కార్పెట్‌పై నడిచి అందరి దృష్టిని ఆకర్షించింది.అయితే జాన్వీ కారు దిగిన మొదలు ఆమె లోపలికి వెళ్లేంత వరకు కూడా కెమెరాలన్నీ ఆమె చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు జాన్వీని తమ కెమెరాలలో బంధించేందుకు పోటీ పడ్డారు.
అతిలోక సుందరి శ్రీదేవి తనయగా సినిమాల్లోకి వచ్చి మెప్పిస్తుంది జాన్వీ కపూర్. బాలీవుడ్‌లో పలుసినిమాలతో మెప్పించింది. ఈ క్రమంలో ఆమెకి తెలుగులో ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇటీవలే ఆమె ఎన్టీఆర్‌తో దేవర చిత్రంలో నటించి మెప్పించింది. అందంతో ఆకట్టుకుంటుంది. అభినయానికి ఇంకా స్కోప్ దక్కలేదు. ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉంది. రామ్ చరణ్‌తో కలిసి పెద్ది Peddiఅనే చిత్రం చేస్తుండగా, ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల జాన్వీ(Janhvi) లుక్ కూడా విడుదల కాగా,ఇది ఆకట్టుకుంది.