- Advertisement -
HomeUncategorizedJanhvi Kapoor | జాన్వీ క‌పూర్‌కు పిల్లో ఫోబియా... అస‌లు కారణం ఏంటి?

Janhvi Kapoor | జాన్వీ క‌పూర్‌కు పిల్లో ఫోబియా… అస‌లు కారణం ఏంటి?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Janhvi Kapoor | అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) అన‌తి కాలంలోనే త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్ట‌ని జాన్వీ త‌న అంద‌చందాల‌తో మాత్రం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తూ ఉంటుంది. టాలీవుడ్‌లో ఎన్టీఆర్‌తో చేసిన దేవర చిత్రం హిట్‌ అయినా, ఆ సక్సెస్ ఎక్కువగా ఎన్టీఆర్ ఖాతాలోనే ప‌డింది. ఇప్పుడు జాన్వీ ఫోకస్ మాత్రం పూర్తిగా ‘పెద్ది’ సినిమాపైనే ఉంది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీపై ఈ అమ్మ‌డు చాలా ఆశలు పెట్టుకుంది.

Janhvi Kapoor | ఎందుకు ఇలా..

అయితే జాన్వీ క‌పూర్‌కి సంబంధించిన వార్త‌లు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. జాన్వీ కపూర్‌కి విచిత్ర‌మైన ఫోబియా ఉంది . అదే పిల్లో ఫోబియా (Pillow Phobia). షూటింగ్‌ కోసం ఎక్కడికెళ్లినా, తన వద్ద రెగ్యులర్‌గా వాడే దిండును తప్పనిసరిగా తీసుకెళ్లాల్సిందేనట. అంతేకాదు, ప‌లు సంద‌ర్భాల‌లో ఈ దిండును ప్రత్యేకంగా ఒక సెక్యూరిటీ ఆఫీసర్ మోస్తూ కనిపించేవారట. ఈ విషయంలో నెటిజన్ల నుంచి జాన్వీపై ట్రోల్స్ కూడా వచ్చాయి. “హోటల్స్‌ లోని దిండులు దొంగతనం చేస్తుందా ఏంటి?”, “ఇది ఏ రకమైన అలవాటు?” అంటూ కామెంట్లు వచ్చాయి. కానీ వాటిని పట్టించుకోకుండా, జాన్వీ తనదైన స్టైల్లో పని చేసుకుంటూ ముందుకు సాగిపోతుంది.

- Advertisement -

జాన్వీ ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రాజెక్ట్స్ పైనా దృష్టి పెట్టింది. భారీ రెమ్యూనరేషన్ తీసుకునే నాయికల లిస్ట్‌లో కూడా ఆమె పేరు చేరిపోయింది. తాజాగా అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లో రూపొందబోయే సినిమాలోనూ జాన్వీ హీరోయిన్‌గా ఎంపిక అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆమె నటించిన ‘పరమ్ సుందరి’ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా మీద కూడా ఆమెకు మంచి నమ్మకం ఉంది. ఒక్క సాలిడ్ హిట్ పడితే, జాన్వీ కెరీర్ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లే అవకాశం ఉండటం ఖాయం. జాన్వీ మాత్రం ఇప్పుడు పూర్తి కాన్స‌న్‌ట్రేష‌న్ పెద్ది చిత్రంపైనే పెట్టింది. ఈ చిత్రం పెద్ద హిట్ అయితే జాన్వీకి మ‌రిన్ని మంచి ఆఫ‌ర్స్ రావ‌డం ఖాయం.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News